తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఎన్​యూ: పోలీసులపై ఎఫ్​ఐఆర్​ నమోదుకు విద్యార్థుల డిమాండ్​​ - జెఎన్​యూ నిరసనలు

జేఎన్​యూ ఘటనలో చెలరేగిన హింసపై జామియా ఇస్లామియా విద్యార్థులు నిరసనలకు దిగారు. ఈ విషయంలో పోలీసులను బాధ్యుల్ని చేస్తూ వారిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని డిమాండ్​ చేస్తూ.. వీసీని అడ్డుకున్నారు.

The police should file a case in the case of JNU
'జేఎన్​యూ ఘటనలో పోలీసులపై కేసు పెట్టాలి'

By

Published : Jan 13, 2020, 4:15 PM IST

జేఎన్​యూ విశ్వవిద్యాలయంలో చెలరేగిన హింసకు పోలీసులపై కేసు నమోదు చేయించాలంటూ జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు ఉపకులపతిని అడ్డుకున్నారు. గేటుకు తాళం వేసి వీసీకి వ్యతిరేకంగా పెద్దఎత్తుననినాదాలు చేశారు. విద్యార్థులకు భద్రత కల్పించే వరకూ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా తరగతులను పున:ప్రారంభించేందుకు సహకరించాలని జేఎన్​యూ పరిపాలన విభాగం అధ్యాపకుల్ని కోరింది. ఈ మేరకు క్యాంపస్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి సహకరించాలని అధ్యాపకులకు లేఖ రాసింది.

తరగతులకు వెళ్లకుండా సహాయ నిరాకరణ చేయాలని జేఎన్​యూ అధ్యాపక సంఘం ఇప్పటికే కార్యచరణ ప్రకటించింది. చాలా మంది విద్యార్థులు సెమిస్టర్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న దృష్ట్యా అధ్యాపకులు తరగతులకు వెళ్లాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details