తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శబరిమల యాత్రకు ఆన్​లైన్​ బుకింగ్​ ప్రారంభం - conditions for sabarimala online booking

శబరిమల యాత్ర కోసం అధికారిక వైబ్​సైట్​లో బుకింగ్​లు ప్రారంభమయ్యాయి. యాత్రికులు గుర్తింపు కార్డుతో పాటు కొన్ని వివరాలు జత చేసి పేరు రిజిస్టర్​ చేసుకోవచ్చు. వివిధ సేవలకు విడిగా కూపన్లు పొందవచ్చు.

శబరిమల యాత్రకు ఆన్​లైన్​ బుకింగ్​ ప్రారంభం

By

Published : Oct 29, 2019, 3:10 PM IST


అయ్యప్ప భక్తులు శబరిమల యాత్ర కోసం తమ పేర్లు ముందుగానే నమోదు చేసుకునేందుకు ఆన్​లైన్​ బుకింగ్​ ప్రారంభమైంది.
భక్తులు www.sabarimalaonline.org లో లాగిన్ అయ్యి వారి పేరు, వయస్సు, చిరునామా, ఫొటో, స్కాన్ చేసిన గుర్తింపు కార్డులు, మొబైల్ నంబర్ల వివరాలు నింపి, బుకింగ్​ చేసుకోవచ్చు.

ఈ శబరిమల యాత్ర మారారూట్టం నుంచి సన్నిధానం నందపంతల్ మీదుగా శరణకుటి వరకు సంప్రదాయ మార్గంలో సాగుతుంది.

ప్రతి ఒక్కరు వేరువేరుగా..

ఒకే కుటుంబమైనా, స్నేహితులైనా యాత్రికులందరూ విడిగా బుక్ చేసుకోవాల్సిందే. వెబ్​సైట్​లో అందుబాటులో ఉండే క్యాలెండర్​లో తేదీ, సమయం ఎంపిక చేసుకోవాలి. ఐదేళ్ల లోపున్న పిల్లలకు బుకింగ్​లు అవసరం లేదు. కానీ, బడిపిల్లలు తమ స్కూల్​ ఐడీ కార్డు జత చేసి రిజిస్టర్​​ చేసుకోవచ్చు.

ప్రతి సేవకు ప్రత్యేక కూపన్​

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ప్రతి సేవకు ప్రత్యేక కూపన్ అందుబాటులో ఉంది. బుకింగ్ పూర్తి చేశాక, యాత్రా సమయం, తేదీని సేవ్ చేసి.. వర్చువల్ క్యూ (స్వామి దర్శన క్యూ) కూపన్‌ ప్రింట్​ చేసుకోవాలి(ధ్రువీకరణకు). యాత్రకు వెళ్లేటప్పుడు ఈ కాగితాలతో పాటు, ఫొటో, గుర్తింపు కార్డు తప్పకుండా తీసుకువెళ్లాల్సి ఉంటుంది.

స్వామి దర్శనానికి వెళ్లే ముందు పంపా గణపతి ఆలయంలోని ఆంజనేయ మండపం వద్ద పోలీసు కౌంటర్​లో ఈ ధ్రువీకరణ కాగితాలను చూపించాలి. ఆపై నమోదు చేసుకున్న సమయానికి గణపతి ఆలయం వద్ద దర్శనం చేసుకోవచ్చు. వర్చుల్​ క్యూ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం కోసం శబరిమల అధికారిక వెబ్​సైట్​ www.sabarimalaonline.org ను సంప్రదించవచ్చు లేదా 7025800100 నంబరుకు ఫోన్​ చేసి వివరాలుు పొందవచ్చు.

ఇదీ చూడండి:ఉగ్రసింహం 'బాగ్దాదీ' కుక్కచావు..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details