- దిల్లీ పటియాల హౌస్ కోర్టులో నిర్భయ దోషులకు శిక్ష అమలుపై విచారణ
- సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కొట్టివేసిన అంశంపై దోషులకు తాజాగా నోటీస్ ఇవ్వాలని తీహార్ జైలు అధికారులకు పటియాల కోర్టు ఆదేశం
- అప్పటివరకు డెత్ వారెంట్ పై నిర్ణయం తీసుకోలేమని తెలిపిన పటియాల హౌస్ కోర్టు
- తదుపరి విచారణ జనవరి 7కి వాయిదా
- నిర్భయ కేసులో దోషులకు శిక్ష అమలులో జాప్యంపై కోర్టును ఆశ్రయించిన నిర్భయ తల్లిదండ్రులు.
- త్వరితగతిన శిక్షను అమలు చేయాలని పిటిషన్ లో కోరిన నిర్భయ తల్లిదండ్రులు.
- న్యాయపరమైన అవకాశాలు అన్ని పూర్తయిన తర్వాతే డెత్ వారెంట్ ఇవ్వాలని కోరిన దోషుల తరపు న్యాయవాదులు
- డెత్ వారెంట్ ఇవ్వాలని కోరిన నిర్భయ తల్లిదండ్రుల తరపు న్యాయవాది
'నిర్భయ' దోషులకు ఉరి ఆలస్యం- జనవరి 7న నిర్ణయం!
14:57 December 18
14:19 December 18
నిర్భయ తల్లి పిటిషన్‌పై పాటియాలా హౌస్ కోర్టు విచారణ..
నిర్బయ కేసులో దోషులకు మరణ శిక్ష వెంటనే అమలు చేయాలని కోరుతూ నిర్బయ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ దిల్లీ పాటియాలా హౌస్ కోర్టు విచారణ జరపనుంది.
14:14 December 18
గడువులోగా క్షమాభిక్ష దరఖాస్తు చేసుకోవచ్చు: సుప్రీం కోర్టు
2012లో సంచలనం రేపిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. తీర్పును పునఃసమీక్షించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. మళ్లీ మళ్లీ విచారించలేమని పేర్కొంది. అక్షయ్ కుమార్ సింగ్ మరణ శిక్షను ధ్రువీకరిస్తూ తీర్పు ప్రకటించింది.
ఈ కేసులో రాష్ట్రపతి క్షమాభిక్షకు.. దోషి దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ఇందుకోసం దోషి తరఫున న్యాయవాది 3 వారాల సమయం అడగగా.. దిల్లీ ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ దీనిని వ్యతిరేకించారు. చట్ట ప్రకారం వారం సమయం మాత్రమే ఉంటుదని కోర్టుకు తెలిపారు. అనంతరం.. చట్టప్రకారం గడువులోగా అర్జీ పెట్టుకోవచ్చని సుప్రీం స్పష్టం చేసింది.
దిల్లీ ప్రభుత్వం తరఫున వాదించిన.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... దోషి రివ్యూ పిటిషన్‌ను వ్యతిరేకించారు. దేశంలో మానవత్వాన్ని మంటకలిపేలా ఎన్నో నేరాలు జరుగుతున్నాయని.. నిర్భయ కేసు అలాంటిదే అన్నారు. దోషికి ఎట్టి పరిస్థితుల్లోనూ మరణ శిక్ష రద్దు చేయరాదని వాదించారు. శిక్షను జాప్యం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈ విషయంలో చట్టం తన పని తాను చేయాలని కోర్టును అభ్యర్థించారు.
న్యాయవాది ఏపీ సింగ్.. దోషి తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్యంతో ప్రజల ఆయుర్దాయం రోజురోజుకూ తగ్గిపోతోందని.. ఇలాంటి పరిస్థితుల్లో నిందితుడికి మరణ శిక్ష అవసరం లేదని కోర్టుకు తెలిపారు. వాదనలు ముగిసిన అనంతరం.. కోర్టు దోషి పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ప్రకటించింది.
సుప్రీం తీర్పుపై బాధితురాలి తల్లి హర్షం వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియలో ముందడుగు పడిందని అన్నారు.
పాటియాలా హౌస్ కోర్టులో విచారణ...
మరోవైపు ఈ కేసులో దోషులకు మరణశిక్ష వెంటనే అమలు చేయాలని కోరుతూ నిర్భయ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ పాటియాలా హౌస్ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఇందులోనూ తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నిర్భయ తల్లి. 2012లో ఘటన...
2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకడు మైనర్ కాగా.... మరొకడు తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన దోషులైన ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మల రివ్యూ పిటిషన్లను గతేడాది జులై 9నే కోర్టు కొట్టివేసింది. మరో దోషి అక్షయ్ కుమార్ సింగ్.. మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ తాజాగా సుప్రీంను ఆశ్రయించాడు.
13:38 December 18
క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు: సుప్రీం
నిర్భయ కేసులో దోషి అక్షయ్.. పునఃసమీక్ష పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు.. చట్ట ప్రకారం ఉన్న గడువులోగా రాష్ట్రపతి క్షమాభిక్ష కోరవచ్చని తెలిపింది. దోషి తరఫున న్యాయవాది 3 వారాల సమయం కోరగా.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చట్ట ప్రకారం వారం సమయం మాత్రమే ఉంటుందని కోర్టుకు తెలిపారు.
13:28 December 18
అక్షయ్ కుమార్‌కు ఉరిశిక్ష ధ్రువీకరించిన సుప్రీం
- నిర్భయ కేసు దోషి అక్షయ్‌కుమార్ రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- దోషి అక్షయ్ కుమార్‌కు ఉరిశిక్షను ధ్రువీకరించిన సుప్రీంకోర్టు
- తీర్పు పునఃసమీక్షకు ఎలాంటి ఆధారాలు లేవన్న త్రిసభ్య ధర్మాసనం
- నిర్భయ కేసులో నలుగురు దోషులకు గతంలోనే ఉరిశిక్ష విధించిన సుప్రీంకోర్టు
13:25 December 18
నిర్భయ దోషి రివ్యూ పిటిషన్ కొట్టివేత
2012లో సంచలనం రేకెత్తించిన నిర్భయ కేసు దోషి అక్షయ్ కుమార్ సింగ్.. తనకు విధించిన ఉరి శిక్షపై పునఃసమీక్ష కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.
13:14 December 18
మరికాసేపట్లో నిర్భయ రివ్యూ పిటిషన్‌పై సుప్రీం తీర్పు
నిర్భయ కేసులో దోషి రివ్యూ పిటిషన్‌పై సుప్రీం కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించే అవకాశముంది. ఏ క్షణంలోనైనా అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
12:13 December 18
చట్టం తన పని తాను చేసుకొనిపోవాలి: సొలిసిటర్ జనరల్
నిర్భయ కేసులో దోషి అక్షయ్ కుమార్ సింగ్ వేసిన పునఃసమీక్ష పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు తీర్పు ప్రకటించనుంది. జస్టిస్ ఆర్. భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం.. పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం తీర్పు వాయిదా వేసింది.
కేసులో దిల్లీ ప్రభుత్వం తరఫున వాదించిన.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రివ్యూ పిటిషన్‌ను వ్యతిరేకించారు. దేశంలో మానవత్వాన్ని మంటకలిపేలా ఎన్నో నేరాలు జరుగుతున్నాయని.. నిర్భయ కేసు అలాంటిదే అన్నారు. దోషికి ఎట్టి పరిస్థితుల్లోనూ మరణ శిక్ష రద్దు చేయరాదని వాదించారు. శిక్షను జాప్యం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈ విషయంలో చట్టం తన పని తాను చేయాలని కోర్టును అభ్యర్థించారు.
న్యాయవాది ఏపీ సింగ్.. దోషి తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్యంతో ప్రజల ఆయుర్దాయం రోజురోజుకూ తగ్గిపోతోందని.. ఇలాంటి పరిస్థితుల్లో నిందితుడికి మరణ శిక్ష అవసరం లేదని కోర్టుకు తెలిపారు.
2012లో ఘటన...
2012 డిసెంబరు 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై దిల్లీలో ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒకడు మైనర్ కాగా.... మరొకడు తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన దోషులైన ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మల రివ్యూ పిటిషన్లను గతేడాది జులై 9నే కోర్టు కొట్టివేసింది. మరో దోషి అక్షయ్ కుమార్ సింగ్.. మరణశిక్షపై పునఃసమీక్షించాలంటూ తాజాగా సుప్రీంను ఆశ్రయించాడు.
11:31 December 18
'నిర్భయ' రివ్యూ పిటిషన్‌పై ఒంటిగంటకు సుప్రీం తీర్పు
నిర్బయ కేసులో దోషి పునఃసమీక్ష పిటిషన్‌పై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. తీర్పును వాయిదా వేసింది. మధ్యాహ్నం ఒంటిగంటకు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.
11:00 December 18
లైవ్: 'నిర్భయ' దోషి రివ్యూ పిటిషన్ కొట్టివేత
నిర్భయ కేసు దోషికి మరణశిక్ష విధించడంపై పునఃసమీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. మరికాసేపట్లో నిర్ణయాన్ని వెలువరించే అవకాశముంది.
దోషి అక్షయ్ కుమార్‌కు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించాలని కోరుతూ అతడి తరఫు తరఫున న్యాయవాది సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటోంది. వాదనలు వినేందుకు నిర్బయ తల్లిదండ్రులు అత్యున్నత న్యాయస్థానంలో హాజరయ్యారు.