తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్టోబర్​ 5 నుంచి అమల్లోకి 'సుప్రీం' కొత్త రోస్టరు విధానం

సుప్రీంకోర్టు కొత్త రోస్టరు విధానం అక్టోబర్​ 5 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం ఎన్నికలు, సామాజిక న్యాయం, హెబియస్​ కార్పస్​ కేసులను ప్రధాన న్యాయమూర్తి ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. ఇంకా ఎవరెవరు ఏ కేసులను పరిశీలించనున్నారంటే..?

The new roster is finalized in the Supreme Court
అక్టోబర్​ 5 నుంచి అమల్లోకి 'సుప్రీం' కొత్త రోస్టరు విధానం

By

Published : Oct 2, 2020, 5:11 AM IST

సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కొత్త రోస్టరు విధానాన్ని ఖరారు చేశారు. ఈ నెల 5 నుంచి అమల్లోకి రానున్న కొత్త రోస్టరు ప్రకారం ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి ఎస్​ఏ బోబ్డేతో పాటు జస్టిస్​ ఎన్​వీ రమణ, జస్టిస్​ పాలీ నారిమన్​, జస్టిస్​ యూయూ లలిత్​, జస్టిస్​ చంద్రచూడ్​, జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ లావు నాగేశ్వరరావుల నేతృత్వంలోని ధర్మాసనాలు విచారిస్తాయి.

ఎన్నికలు, సామాజిక న్యాయం, హెబియస్​ కార్పస్​ కేసులను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది.

కోర్టు ధిక్కరణ కేసులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్​ యూయూ లలిత్​లతో కూడిన బెంచ్​లు చూస్తాయి. మతం, ధార్మిక సంబంధమైన విషయాలను జస్టిస్​ ఎన్​వీ రమణ, జస్టిస్​ లలిత్​, జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ అశోక్​ భూషణ్​ల నేతృత్వంలోని ధర్మాసనాలు విచారిస్తాయి. ఆర్బిట్రేషను కేసులు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే, జస్టిస్​ ఎన్​వీ రమణ, జస్టిస్​ పాలీ నారిమన్​, జస్టిస్​ ఇందూ మల్హోత్రా, జస్టిస్​ ఇందూ బెనర్జీలతో కూడిన ధర్మాసనాలు చూస్తాయి.

2019 జులై 1న జారీ చేసిన రోస్టరు ఇప్పటివరకూ అమల్లో ఉంది. 5వ తేదీ నుంచి కొత్త రోస్టరు అమల్లోకి వస్తుంది.

ABOUT THE AUTHOR

...view details