తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీట్​ పరీక్ష ఫలితాలు విడుదల

NEET
నీట్​ పరీక్ష ఫలితాలు విడుదల

By

Published : Oct 16, 2020, 4:56 PM IST

Updated : Oct 16, 2020, 5:55 PM IST

17:53 October 16

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 13న జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్‌) నిర్వహించారు.  ఈ పరీక్షకు 14.37లక్షల మందికి పైగా (90శాతం మంది) హజరయ్యారు.

కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 3,862 కేంద్రాల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. సెప్టెంబర్‌ 13న కరోనా నేపథ్యంలో హాజరు కాని విద్యార్థులకు ఈ నెల 14న ప్రత్యేకంగా పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఈ రెండు పరీక్షల ఫలితాలను కలిపి అధికారులు http://ntaneet.nic.in/ వెబ్‌సైట్‌ ద్వారా శుక్రవారం విడుదల చేశారు.

16:52 October 16

నీట్​ పరీక్ష ఫలితాలు విడుదల

నీట్ 2020 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబర్​ 13, అక్టోబర్​ 14 రెండు ప్రయత్నాల్లో పరీక్షలు రాసిన వారి ఫలితాలు ఇందులో ఉన్నాయి. అభ్యర్థులు వారి ర్యాంక్​లను ntaneet.nic.in or nta.ac.inలో తెలుసుకోవచ్చు.

Last Updated : Oct 16, 2020, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details