కేరళ కొట్టాయం సమీపంలో మలరికాల్ గ్రామంలో అంబాల్ ఆలయం చెరువు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కొట్టాయం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరువు విరబూసిన కలువపూలతో కళకళలాడుతోంది.
కలువ పూలతో నిండిపోయిన చెరువు గులాబీవర్ణ శోభితంగా మెరిసిపోతోంది. ఈ దృశ్యం ఐరోపాలోని తులిప్ పుష్పాలను గుర్తుకు తెస్తున్నాయి.