మధ్యప్రదేశ్ శాసనసభ బలపరీక్షకు సంబంధించి నేడూ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగునుంది. రాష్ట్రంలో తిరుగుబాటు(కాంగ్రెస్) ఎమ్మెల్యేలను న్యాయమూర్తి ఛాంబర్లో ప్రవేశపెట్టాలన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిపాదనను కోర్టు తిరస్కరించింది. బలపరీక్ష వ్యాజ్యాలకు సంబంధించి మరిన్ని వాదనలు ఇవాళ కూాడా విననుంది సుప్రీంకోర్టు.
చౌహాన్ ప్రతిపాదనపై స్పందిస్తూ.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరైతే వారి రాజీనామాలపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో తెలపాలని సభాపతి తరఫు న్యాయవాది ఎ.ఎం. సింఘ్వీని న్యాయస్థానం ప్రశ్నించింది. సభాపతి అభిప్రాయాన్ని తెలుసుకొని గురువారం కోర్టుకు చెబుతానని సింఘ్వీ సమాధానమిచ్చారు. మధ్యప్రదేశ్లో రాజకీయ పరిణామాలపై శివరాజ్సిగ్ చౌహాన్, కాంగ్రెస్ పార్టీ, స్పీకర్లు వేరువేరుగా వేసిన పిటిషన్లపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపింది.
నాటకీయ పరిస్థితులు..