తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ వేళ ఇంటిని అందంగా మార్చేద్దాం ఇలా.. - వ్యాయామాలు

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్​డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. ఇలాంటి సందర్భంలో మన ఇంట్లోని వస్తువులతోనే ఇంటిని అందంగా అలంకరించటానికి ఎంతో సమయం ఉంది. అయితే ఎందుకు ఆలస్యం ఈ చిట్కాలతో ఇంటిని ఆహ్లాదంగా మార్చేయండి.

The lockdown makeover for your home
లాక్​డౌన్​ వేళ ఇంటిని అందంగా మార్చేద్దాం..

By

Published : Apr 12, 2020, 9:34 AM IST

కొవిడ్-19 నివారణలో భాగంగా లాక్​డౌన్​ కట్టుదిట్టంగా అమలవుతోంది. రోజుల తరబడి ఇంట్లోనే ఉండటం వల్ల ఏమి చేయాలో తెలియదు. పుస్తకాలు చదవటం, కవితలు రాయడం, వ్యాయామాలు చేయటం వంటివి చేస్తుంటారు కొందరు. అయితే.. తగినంత సమయం ఉన్నందున ఇంటిని అందంగా అలంకరించుకోండి.

సాధారణంగా ఇంటిని అలంకరించేందుకు విభిన్న రకాల వస్తువులను ఆన్​లైన్​లో తెగ వెతికేస్తుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో షాపింగ్​కు వెళ్లలేం. ఆన్​లైన్​ సదుపాయమూ లేదు. ఈ సందర్భంలో ఇంటిలోని పాత, వాడకుండా పడేసిన వస్తువులను ఉపయోగించి అలకరణ వస్తువులను సొంతంగా తయారు చేసుకోండి. కొన్ని చిట్కాలు మీకోసం..

  • ఇంట్లో వాడకుండా ఉన్న డిజైనర్​ ప్లేట్లు, పాత బెడ్​ షీట్లు, దుస్తులు, పాత స్టోన్స్​, ఫాబ్రిక్స్ వంటి వాటిని ఉపయోగించి వివిధ రకాల కళాకృతులుగా తీర్చిదిద్దవచ్చు. పాత బెడ్ షీట్లతో అవసరమైన మ్యాట్​లు, కర్టైన్లు వంటి వస్తువులు తయారు చేయొచ్చు. గోడలకు విభిన్న రకాల కళాకృతులను వేసి అందంగా తయారు చేయవచ్చు.
  • పాత చైనా ప్లేట్లను కొత్తగా డిజైన్ చేసి గదిలో, డైనింగ్​ హాల్​లో గోడలకు వేలాడదీస్తే అంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కొత్త అలంకరణలను చూసినప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మానసిక స్థితిని మెరుగు పడుతుంది.
  • పాత ఫొటోలను సంరక్షించుకునే సమయం ఇదే. ఆ పాత జ్ఞాపకాలను వెలికితీసి గోడలకు తగిలించండి. పాత ఫొటోలను ఓ గ్యాలరీగా సృష్టించి మీ ప్రియమైన వారికి అందించండి.
  • మీ ఇంటి ఆవరణంలో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పూల మొక్కలు, సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకు కూరలు వంటి వాటిని పెంచండి. దీని వల్ల స్వచ్ఛమైన గాలితో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
  • మీ ఇంట్లోని ఫర్నిచర్​, వస్తువుల స్థానాలను మార్చి సరికొత్త అనుభూతిని పొందవచ్చు. ఉదాహరణకు టీవీ, సోఫా, కుర్చీలు, బెడ్ల స్థానాలు మార్చటం, అలంకరణ వస్తువులను మార్చటం వంటివి.
  • మీకు పుస్తకాలు చదవడం ఇష్టమైతే మీ ఇంట్లోని ఓ అల్మరాను పూర్తిగా దానికే కేటాయించండి. మీ ఇంటి బాల్కానీలు, పరిసరాలు శుభ్రం చేసేయండి.

ఇదీ చదవండి:కరోనా కట్టడిలో 'కేరళ మోడల్​' సూపర్ ​హిట్​!

ABOUT THE AUTHOR

...view details