కరోనాపై పోరుకు లాక్డౌన్ను ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది కేంద్రం. తొలి దఫాగా మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయినా వైరస్ వ్యాప్తి అదుపులోకి రానందున... ఆంక్షలు కొనసాగించడం అనివార్యమైంది.
లాక్డౌన్ కొనసాగించే విషయమై అన్ని రాష్ట్రాలతో విస్తృత సంప్రదింపులు జరిపింది కేంద్రం. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో సుదీర్ఘంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
30 వరకే అనుకున్నా...
లాక్డౌన్ను ఏప్రిల్ 30 వరకు అమలు చేయాలని దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. కానీ... మే 3 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. రాష్ట్రాలు కోరినదానికన్నా 3 రోజులు ఎక్కువగా లాక్డౌన్ కొనసాగించడానికి ఓ కారణముంది.
మే 1... కార్మిక దినోత్సవం, పబ్లిక్ హాలిడే. మే 2 శనివారం, మే 3 ఆదివారం. ఈ 3 రోజులు ఎలాగో సెలవులే కాబట్టి... లాక్డౌన్ను అప్పటివరకు పొడిగించడమే మేలని భావించింది కేంద్రం. మొత్తంగా భారత్ 40 రోజులు లాక్డౌన్లో ఉంటుంది.
ఇదీ చూడండి:మే 3 వరకు లాక్డౌన్ పొడిగింపు- మోదీ ప్రకటన