తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాజు 'ఇగో' వల్లే... ఫిబ్రవరికి తక్కువ రోజులు! - ఫిబ్రవరికి తక్కువ రోజుల కారణం

ఫిబ్రవరి నెలలో ఎన్నిరోజులుంటాయంటే 28 రోజులని, అదే లీపు సంవత్సరమైతే 29 రోజులని ఠక్కున చెప్పేస్తుంటాం. కానీ.. మిగతా అన్ని నెలలకు 30/31 రోజులుంటాయి కదా మరి ఫిబ్రవరికి మాత్రమే ఎందుకలా అనే అనుమానం కలిగిందా? అయితే.. అసలు ఆ కథేంటి, అందుకు కారణమేంటని తెలుసుకోవాలంటే ఓ సారి క్రీ.పూ 46 వ శతాబ్దంలోకి వెళ్లాల్సిందే.!

The king Augustus caused the day to decline in February
ఆ రాజు ఇగో వల్లే ఫిబ్రవరికి తక్కువ రోజులు

By

Published : Feb 29, 2020, 2:31 PM IST

Updated : Mar 2, 2020, 11:08 PM IST

ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 28 రోజులు.. లీపు సంవత్సరమైతే 29 రోజులు ఉంటాయని ఎవరైనా ఠక్కున చెప్పేస్తారు. కానీ.. అసలు ఆ నెలలో 28/29 రోజులు ఎందుకు ఉన్నాయని ఎప్పుడైనా అనుమానం కలిగిందా? అయితే దాని వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకోవాలంటే క్రీస్తు పూర్వం 46 వ శతాబ్దానికి వెళ్లాలి.

రోమన్‌ క్యాలెండర్‌, జూలియస్‌ క్యాలెండర్‌ విషయంలో ఆనాటి పరిశోధకుడు, విద్యావేత్త శాక్రోబోస్కో సిద్ధాంతం ప్రకారం...

పూర్వం రోమన్‌ సామ్రాజ్యంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి జూలియస్‌ సీజర్‌. రాజకీయాల్లో, సైన్యంలో అతడు కీలకంగా వ్యవహరించేవాడు. అంతేకాదు.. సాహిత్యకారుడు, చరిత్రకారుడు కూడా! జూలియస్‌ హయాంలోనే రోమన్‌ క్యాలెండర్‌లో సంస్కరణలు చేసి.. కొత్త క్యాలెండర్‌ను తీసుకొచ్చాడు.

జూలియస్​

అప్పట్లో ఏడాదికి 354 రోజులే...

రోమన్‌ క్యాలెండర్‌లో జనవరి-30, ఫిబ్రవరి-29, మార్చి-30, ఏప్రిల్‌-29, మే-30, జూన్‌-29, జులై-30, ఆగస్టు-29, సెప్టెంబర్‌-30, అక్టోబర్‌-29, నవంబర్‌-30, డిసెంబర్‌-29 రోజులుగా ఉండేవి. అంటే రోమన్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏడాదికి మనకు 354 రోజులే ఉండేవన్నమాట. అయితే.. జూలియస్‌ సీజర్‌ వాటిలో మార్పులు చేశాడు. ఏడాదికి 11 రోజులను అదనంగా అంటే ప్రతినెలకు ఒక్కో రోజును కలిపాడు. అయితే ఫిబ్రవరిలో 29 రోజులే ఉంచాడు. ఎందుకంటే లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు అదనంగా ఒక రోజు వచ్చి చేరి 30 రోజులు అవుతాయని భావించాడు. అలా జూలియస్‌ క్యాలెండర్‌ తయారైంది.

హర్ట్​ అయిన 'ఇగో'

అయితే.. జూలియస్‌ సీజర్‌ తర్వాత రోమన్‌ సామ్రాజ్య సింహాసనాన్ని అగస్టస్‌ అధిష్ఠించాడు. ఆయన హయాంలో జూలియస్‌ క్యాలెండర్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూలియస్‌ పేరుతో ఉన్న జులై నెలలో రోజులు 31 ఉండగా... తన పేరుతో ఉన్న ఆగస్టు నెలలో 30 రోజులే ఉండటం అగస్టస్‌కు మింగుడుపడలేదు. జూలియస్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని భావించిన అగస్టస్‌.. ఫిబ్రవరిలో ఉన్న 29 రోజుల్లో ఒక రోజును తీసేసి ఆగస్టులో కలిపాడు. దీంతో పక్క పక్కన ఉన్న జులై, ఆగస్టు 31 రోజులు ఉన్న నెలలుగా మారిపోయాయి.

అగస్టస్​

ఈ క్రమంలో 28 రోజులతో అతి తక్కువ రోజులున్న నెలగా ఫిబ్రవరి మిగిలిపోయింది. ఆ క్యాలెండర్‌నే ఇప్పటికీ మనం వాడుతున్నాం. అయితే.. శాక్రోబోస్కో సిద్ధాంతం తప్పని చెబుతూ అనేక సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. కానీ.. శాక్రోబోస్కో సిద్ధాంతం మాత్రమే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఇదీ చదవండి:అతివల అందానికే కాదు ఆపదలోనూ రక్షించే రింగు

Last Updated : Mar 2, 2020, 11:08 PM IST

ABOUT THE AUTHOR

...view details