రామమందిర భూమిపూజ కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యంగా రామ జన్మభూమిలోని రామ్‌లల్లా విగ్రహాన్ని అత్యద్భుతంగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శ్రీరాముని ప్రతిమను తీర్చిదిద్దారు. దీపాల వెలుగులో రామ్‌లల్లా విగ్రహం ధగధగా మెరిసిపోతోంది.
రామ జన్మభూమి ప్రాంగణాన్ని కూడా ప్రత్యేకంగా ముస్తాబు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. వేదిక ముందు వేసిన రంగురంగుల ముగ్గులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.