తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అశ్రునయనాల మధ్య 'ఉన్నావ్​' బాధితురాలికి వీడ్కోలు

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి అంత్యక్రియలు ఈరోజు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, భారీగా తరలివచ్చిన గ్రామస్ధుల కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు ముగిసాయి. తొలుత ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వచ్చేవరకూ అంత్యక్రియలు నిర్వహించేది లేదని బాధిత కుటుంబం తేల్చిచెప్పింది. డిమాండ్లను నెరవేరుస్తామని అధికారులు హామి ఇవ్వగా వారు శాంతించారు.

unnav sister
ఆశ్రునయనాల నడుమ ఉన్నావ్​ బాధితురాలి అంత్యక్రియలు

By

Published : Dec 8, 2019, 2:42 PM IST

Updated : Dec 8, 2019, 2:51 PM IST

అత్యాచార నిందితులు నిప్పంటించడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉత్తర్​ప్రదేశ్‌ ఉన్నావ్‌ బాధితురాలి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, గ్రామస్ధుల కన్నీటి వీడ్కోలు మధ్య ముగిసాయి.

ఉన్నావ్‌లోని ఆమె స్వస్థలంలో అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు భారీ సంఖ్యలో అంత్యక్రియలకు హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని మొదట ఆమె కుటుంబ సభ్యులు పట్టుపట్టారు. అయితే ప్రధాని ఆవాస్‌ యోజన కింద ఇళ్లు మంజూరు చేయడం సహా కుటుంబానికి రక్షణ కల్పిస్తామని అధికారులు హామీ ఇవ్వడం వల్ల వారు శాంతించారు.

దాడికి పాల్పడిన నిందితులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి కుటుంబం మరోసారి డిమాండ్‌ చేసింది. తమ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, దాడికి పాల్పడిన వారికి ఉరి శిక్ష విధించాలని ఆమె సోదరి కోరారు.

అశ్రునయనాల మధ్య 'ఉన్నావ్​' బాధితురాలికి వీడ్కోలు

ఇదీ చూడండి : 'సీఎం యోగీ వస్తేనే.. అంత్యక్రియలు నిర్వహిస్తాం'

Last Updated : Dec 8, 2019, 2:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details