తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోంలో వరుణుడి ఉగ్రరూపం- నలుగురు మృతి

ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 17 జిల్లాల్లోని 8.69 లక్షలమందిపై ప్రభావం పడింది. నలుగురు మృతి చెందారు. అరుణాచల్ ప్రదేశ్, భూటాన్​లో కురిసిన వర్షాలు అసోంలో వరద పెరగడానికి కారణమయ్యాయి.

By

Published : Jul 12, 2019, 7:02 PM IST

అసోంలో తీవ్ర వరదలు-4లక్షల మందిపై ప్రభావం

అసోంలో వరదలు- 8.69 లక్షల మందిపై ప్రభావం

అసోంలో వరద బీభత్సానికి నలుగురు బలయ్యారు. 17 జిల్లాల్లోని 8 లక్షల 69 వేల మందిపై ప్రభావం పడింది. 16 వేల హెక్టార్లలో పంటనష్టం జరిగింది.

విపత్తు నిర్వహణ దళం గణాంకాల ప్రకారం బార్​పేట, దేమాజీ, లఖింపూర్, గోలాఘాట్, మజూలీ, నల్బరీ, నాగావ్, మోరీగావ్, చిరాంగ్, కోక్రాఝర్, జోర్హాట్, దిబ్రూగఢ్, బోన్గాయిగావ్, బక్సా, దర్రాంగ్, సోనిత్​పూర్​లలో నష్టం ఎక్కువగా సంభవించిందని తెలుస్తోంది.

అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ, జాతీయ విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్, భూటాన్​లో ఇటీవల కురిసిన వర్షాలు అసోంలో వరదలు పెరిగేందుకు కారణమయ్యాయి. బ్రహ్మపుత్ర, ఉపనదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

అసోంలో మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: ఈశాన్యాన జోరు వర్షం- బ్రహ్మపుత్ర ఉగ్రరూపం

ABOUT THE AUTHOR

...view details