కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారు తక్కువ ధరలకే వస్తువులను అమ్మడం సాధారణం. అయితే ఈ వ్యూహం మాంసం ఉత్పత్తులకు కూడా పనికొస్తుందని తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి నిరూపించాడు. శివగంగ జిల్లాలోని కరైకుడిలో ఓ వ్యాపారి కొత్తగా చేపల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటుచేశాడు. తన దగ్గర వచ్చిన మొదటి వంద మందికి కేవలం రూపాయికే కిలో చేపలు అమ్ముతానని ప్రచారం చేశాడు.
రూపాయికే కిలో 'చేప'.. తొలి వంద మందికే ఆఫర్! - fish latest news
తమిళనాడు శివగంగ జిల్లా కరైకుడిలో ఓ వ్యాపారి తన చేపల విక్రయ కేంద్రం ప్రచారం కోసం వినియోగదారులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. రూపాయికే కిలో చేపలు అమ్మి ప్రజలను తన కొట్టు ముందు బారులు తీసేలా చేశాడు ఆ వ్యాపారి. ఫలితంగా ఆ చేపల కొట్టు విసృత ప్రచారం పొందిందని హర్షం వ్యక్తం చేశాడు.
రు.1 కే కిలో చేపలు బంపర్ ఆఫర్...
దీంతో చేపలు కొనడానికి ఉదయం ఆరు గంటల నుంచే ప్రజలు దుకాణం ముందు బారులు తీరారు. తొలి వంద మందికే చేపలు దక్కినప్పటికీ.... తనకు విస్తృత ప్రచారం జరిగిందని వ్యాపారి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. రూపాయికే ఇడ్లీలు అమ్ముతున్న బామ్మే తనకు స్ఫూర్తి అని సదరు వ్యాపారి తెలిపాడు.
ఇదీ చూడండి : 'మాతృభాష'ను పరిరక్షించాల్సిన తరుణమిది..!