సీరం సంస్థ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకాలను భూటాన్‌కు ఉచితంగా సరఫరా చేస్తోంది భారత్. దీనికి సంబంధించి 1.5లక్షల డోసులతో తొలి కన్సైన్మెంట్ ముంబయిలోని ఛత్రపతి శివాడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భూటాన్ రాజధాని థింపు నగరానికి బుధవారం బయలు దేరింది.
మాల్దీవులకు కూడా లక్షల డోసుల టీకాలను బుధవారమే ఎగుమతి చేయనుంది భారత్. పొరుగు దేశాలకు ఔషధ ఉత్పత్తుల సాయం ఒప్పందంలో భాగంగా.. పలు దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపుతోంది భారత ప్రభుత్వం. కరోనా ప్రభావం నేపథ్యంలో భారత సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను పొరుగు దేశాలకు ఇస్తున్నట్లు విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించించింది. భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్, సీషెల్స్ దేశాలకు బుధవారం నుంచి కరోనా వ్యాక్సిన్ సరఫరా చేయనుంది. శ్రీలంక, అఫ్గానిస్థాన్, మారిషస్ దేశాల నుంచి ఎంత అవసరమో ధ్రువీకరణ ఇంకా రాలేదన్న విదేశాంగ శాఖ.. వచ్చిన వెంటనే ఈ దేశాలకు కూడా టీకా సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది.