కర్ణాటకలోని బీదర్లో సొంత కుమారుడిపై కేసు పెట్టేందుకు వచ్చిన ఓ తండ్రి పోలీసు స్టేషన్ ముందు ఉన్న చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు వేధింపులకు గురిచేస్తున్నాడని శుక్రవారం ఫిర్యాదు చేయటానికి శరణప్ప అనే వ్యక్తి వెళ్లాడు. అంతలోనే ఊహించని నిర్ణయం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు వాపోయారు.
బీదర్ జిల్లాలోని హుమనాబాద్ తాలూకా హల్లిఖేడ్ గ్రామంలో చెట్టుకు ఉరి వేసుకుని శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంత కాలంగా కొడుకుతో గొడవ పడుతున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.