అడవి నుంచి ఆనందాల గూటికి
నీలంబర్లో ఇటీవల భారీ వరదల కారణంగా కుటుంబాన్ని కోల్పోయింది ఓ బుజ్జి ఏనుగు పిల్ల. కరింపుజ ప్రాంతంలో జులై 14వ తేదీన అటవీ శాఖ అధికారులు దానిని గుర్తించారు. వాహనంలో తీసుకెళ్లి అడవిలో విడిచిపెట్టారు. కానీ, అక్కడ తిరుగుతున్న రెండు ఏనుగు గుంపులు ఈ చిన్నారి ఏనుగును ఆదరించలేదు. తమతో చేర్చుకోలేదు.
బిక్కమొహం వేసుకుని ఒంటరిగా తిరుగుతున్న ఏనుగు పిల్లను డిప్యూటీ రేంజర్ రంజిత్ కుమార్, డిప్యూటీ వార్డెన్ అనిల్‌కుమార్‌లు చేరదీశారు. కప్పుకడు సంరక్షణ కేంద్రానికి తీసుకువచ్చారు. ఇక్కడ రెండు నెలలు వయసున్న ఈ పిల్ల ఏనుగుకు కొత్త స్నేహితులు కలిశారు. ఇంకేముంది ఆనందంతో ఆటలాడేస్తూ గెంతులేస్తోంది.