అరుదైన అద్భుతం..
కురవంజి.. ప్రకృతి సృష్టించిన ఓ అద్భుతం. గుర్గి హూవుగా కూడా పిలిచే ఈ పువ్వు శాస్త్రీయ నామం.. స్ట్రోబిలాంతెస్ కుంతియానా. పుష్కరానికి ఒక్కసారి మాత్రమే పూచే ఈ పువ్వు.. పచ్చని పర్వత అందాలలో వంకాయ వర్ణంలో వయ్యారాలుపోతుంది.
వర్షం, గాలి, నీరు, కాంతి... అన్నీ సమతుల్య నిష్పత్తిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది. అందుకే, దేశంలో మరెక్కడా కనిపించని ఈ కుసుమం.. పశ్చిమ కనుమల సున్నితమైన వాతావరణంలో మాత్రమే ఒదిగిపోతుంది. చంద్రద్రోణ, దేవర మానే, చార్ముడి, ఇతర కొండలలో ఇది సాధారణం. గుర్గి పువ్వులలో అనేక రకాలు ఉన్నాయి. అందులో కొన్ని రకాలు 5, 7, 12 ,14 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తాయి.
"ఈ పూలు పూచే సమాయానికి నేను ఇక్కడ ఉన్నందుకు నాకు ఎంతో గర్వంగా , సంతోషంగా ఉంది. మహా కుంభమేళా 12 ఏళ్లకు ఒక్కసారి వస్తుంది. అలాగే ఈ పూలు 12 ఏళ్లకు ఓసారి మాత్రమే పూస్తాయి. ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి తరించాల్సిన పూలివి. నేను భారత దేశ వ్యాప్తంగా 365 రోజుల పర్యటనకు బయల్దేరాను. ఇప్పటివరకు 9 నెలలైంది. అంతలోనే ఈ కురవంజి పూలను చూసే అవకాశం దక్కింది. ఈ పూలు వికసించే సమయానికి నేను ఇక్కడికి చేరుకోవడం నా అదృష్టం." - పర్యటకుడు.
గుణవంతమైన గుర్గీలు..