కథ ఇక్కడ మొదలైంది..
హేమానంద్ ముత్తాత బద్రీ.... జూలియా అనే ఓడలో కూలీగా పనిచేసేవారు. పని కోసం కోల్‌కతా నుంచి మారిషస్ వెళ్లిన ఆయన.. తర్వాత అక్కడే స్థిరపడిపోయారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయం తెలుసుకున్న హేమానంద్... తన పూర్వీకుల గ్రామానికి వెళ్లాలని, తమ బంధువులెవరైనా ఉంటే కలవాలని తలచాడు.
మొదట మారిషస్‌లోని మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ లైబ్రరీకి వెళ్లి తన ముత్తాతకు సంబంధించిన కొన్ని పత్రాలను సంపాదించాడు హేమానంద్. అందులో అతని చిరునామాలో ఫుల్వారీ పరగనా గ్రామం, దినాపుర్ అని రాసి ఉన్నాయి. అవే నేటి పట్నాలోని ఫుల్వారీ షరీఫ్, దానపుర్. ఈ పత్రాల ఆధారంగా తన పూర్వీకుల కోసం హేమానంద్ తన భార్యతో కలిసి ఫుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీసుల సహకారంతో తన పూర్వీకుల విశేషాలు తెలుసుకున్నాడు హేమానంద్.
"నేను మారిషస్ నుంచి వచ్చాను. 1853లో మా ముత్తాత ఇక్కడి నుంచి వచ్చారు. నా పేరు బద్రీ. మూలాలు వెతకడానికి ఇక్కడికి వచ్చాను. ఎవరైనా మా తాత ఫోటోను చూసి గుర్తుపడితే నన్ను సంప్రదించండి."
-హేమానంద్ బద్రీ