తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లెఫ్టిస్టుల 'రైట్'​ టర్న్​... వేదాలపై సీపీఐ పాఠాలు - వేదాలపై సీపీఐ పాఠాలు

వేద తరగతులను​ నిర్వహించేందుకు సిద్ధమైంది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్​ ఇండియా. సీపీఐ నేత, మాజీ మంత్రి దివంగత ఎన్​ఈ బలరాం బయంతి సందర్భంగా 'ద భారతీయం-19' పేరుతో 3 రోజుల కార్యక్రమాన్ని కేరళలోని కన్నూరులో నిర్వహించనుంది.

The Communist Party Of India will teach 'Veda'

By

Published : Oct 10, 2019, 1:11 PM IST

Updated : Oct 10, 2019, 6:10 PM IST

వేదాలపై సీపీఐ పాఠాలు

భాజపా దూకుడుకు కళ్లెం వేసే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ నేత, మాజీ మంత్రి దివంగత ఎన్​ఈ బలరాం జయంతిని పురస్కరించుకుని ఈ నెల 25న వేదాలపై సదస్సు​ నిర్వహించాలని నిర్ణయించింది.

వేదాలు, పురాణేతిహాసాల్లో ఉద్దండులైన పండితుల సమక్షంలో 'ద భారతీయం-2019' పేరుతో 3 రోజుల కార్యక్రమాన్ని కేరళలోని కన్నూరులో నిర్వహించనుంది సీపీఐ. ఈ కార్యక్రమాన్ని జాతీయ కార్యదర్శి డి.రాజా ప్రారంభిస్తారు. ఇందులో 150 మంది నూతన అభ్యాసకులకు ప్రవేశం కల్పిస్తారు.

ఆర్​ఎస్​ఎస్​ను అడ్డుకోవటమే లక్ష్యం!

కేరళలో భాజపా, ఆర్​ఎస్​ఎస్​ ఎదుగుదలను అడ్డుకోవటమే లక్ష్యంగా వేదాల వైపు దృష్టి పెట్టింది సీపీఐ. యువతను ఆకర్షించేందుకు ఇదొక మార్గంగా ఎంచుకుంది. ఆర్నెల్లలోపు మరో సదస్సు కూడా నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం.

ఆర్​ఎస్​ఎస్​ గతంలో నిర్వహించిన 'బాలగోకులం శోభ యాత్ర'కు పోటీగా కన్నూరు జిల్లాలో ఇటీవల సాంస్కృతిక ర్యాలీ నిర్వహించింది పార్టీ. ప్రస్తుతం వేదాలను నేర్పించనుంది. అయితే ఇలాంటి కార్యక్రమాలు పార్టీ భావజాలానికి వ్యతిరేకమని వాదించే వారూ ఉన్నారు.

ఇదీ చూడండి:- 'కాంగ్రెస్​ ఆత్మపరిశీలన చేసుకోవాలి- ఇది అత్యవసరం'

Last Updated : Oct 10, 2019, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details