తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోజుకు 7 సార్లు రంగు మార్చే శివ లింగం! - color changing shivling

ఆ శివలింగం రోజుకు ఏడుసార్లు రంగు మారుతుంది. రోజూ తెల్లవారుజామున అక్కడ శంఖం, డోలు శబ్దాలు మారుమోగుతాయి. అక్కడి పార్వతీ కొలనులో స్నానం ఆచరిస్తే.. సంతానం కలుగుతుందట. ఇలా ఒక్కటేమిటి... ఆ ప్రాంతమంతా శివమహిమల విశేషాలే వినిపిస్తాయి. అదే.. హిమాచల్​ప్రదేశ్​లోని​ కిన్నౌర్​ కైలాస్.

special-stroy-on-kinner-kailash
రోజుకు 7 సార్లు రంగు మార్చే శివ లింగం!

By

Published : Mar 4, 2020, 10:52 AM IST

రోజుకు 7 సార్లు రంగు మార్చే శివ లింగం!

దేవతల రాజధానిగా పేరుపొందిన హిమాచల్​ప్రదేశ్​లో అడుగడుగునా దైవమహిమలే. ప్రతి పర్వతంలోనూ శాస్త్రవేత్తలు సైతం తేల్చలేని దేవ రహస్యాలే. ఆ కోవకు చెందిందే కిన్నౌర్ జిల్లాలోని 'కిన్నౌర్​​ కైలాస్'​. 45 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పుతో మహాశివ లింగం కొలువుదీరిన ఈ పర్వతం రోజుకు ఏడు సార్లు రంగు మారుతుంది. అందుకే ఈ అద్భుతాన్ని తిలకించేందుకు దేశ, విదేశాల ప్రజలు తరలివస్తారు.

శివయ్య శీతాకాలం విడిది...

హిమాలయాల గర్భంలో దాగి ఉన్న ​ కైలాస గిరి​.. భోలేనాథుడికి అత్యంత ప్రియమైన స్థలం. అయితే, ఆ శంభో శంకరుడు సర్వాంతరయామి. మరి ఏడాది పొడవునా కైలాసంలోనే ఉండిపొమ్మంటే ఇబ్బందే కదా? అందుకే.. ఏటా శీతాకాల విడిది కోసం ఆ పరమ శివుడు కిన్నౌర్​ కైలాస్​కు వస్తాడని చెబుతారు ఇక్కడి ప్రజలు.

సూర్యోదయానికి ముందు చుట్టుపక్కల పర్వతాలన్నీ ఓ రంగులో ఉంటే.. కిన్నౌర్​ కైలాస్​ పర్వతం మాత్రం ఓ ప్రత్యేకమైన ప్రకాశంతో వెలిగిపోతుంది. రోజుకు ఏడు సార్లు ఈ పర్వతం రంగు మారుతుంది. ఇక్కడి శివలింగం రంగు కూడా మారుతూనే ఉంటుంది. అయితే, ఏళ్లుగా సాక్షాత్కరిస్తున్న ఈ అద్భుతం వెనుక రహస్యమేమిటో ఇప్పటికీ నిగూఢమే!

రావణుడూ పూజించెను..

త్రేతాయుగంలో గొప్ప శివభక్తుడైన రావణాసురుడు మానస సరోవర యాత్రకు వెళ్లినప్పుడు ఆయన కిన్నౌర్​లో కొద్దిరోజులు బస చేశారని అంటారు. అప్పుడు శివుడు శీతాకాల విడిదిలో ఇక్కడ కొలువుదీరి ఉన్నందున.. రావణుడు ఈ శివలింగానికే పూజలు చేసినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి.

అయితే, ఇప్పుడు సరాహపుర్​గా పిలిచే షోనీక్​పుర్​ రాజ్యాన్ని పాలించిన రాజు.. కిన్నౌర్​లో శివలింగాన్ని ప్రతిష్ఠించారని మరో కథ ప్రచారంలో ఉంది.

సంతానమిచ్చే కొలను..

కిన్నౌర్​ కైలాస్​ శివలింగానికి 500 మీటర్ల దిగువన పార్వతీ కొలను ఉంటుంది. ఇందులో స్నానం ఆచరించినవారికి.. సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడివారి నమ్మకం.

కైలాస యాత్రలు..

కిన్నౌర్​ కైలాస్​ యాత్రలు 1990లో ప్రారంభమయ్యాయి. అప్పట్లో సమీప గ్రామాల వారు వందలాది గాడిదలు, మేకలను తీసుకుని పర్వతారోహణం చేసేవారు. వారికి తెల్లవారుజామున శంఖం, డోలు శబ్దాలు వినిపించేవి. ఆ సమయంలో కిన్నౌర్​ కైలాస్​పై పెద్దపెద్ద తారలు రాలిపడుతూ దర్శనమిచ్చేవి. ఆ ప్రాంతంలో ఓ భారీ ఆకారం నడుస్తూ కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

"మా గ్రామంలోని ఓ పాడి రైతు.. ఆవులు, మేకలను తీసుకుని కిన్నౌర్​ కైలాస్​​పై ఉన్న ఓ గుహలోకి వెళ్లాడు. ఆయనకు రాత్రిపూట ఓ ధ్వని వినిపించింది. శంఖం, డోలు నగారాలు వినిపించాయి. అప్పుడే పరమశివుడు ఇక్కడే ఉన్నాడని అందరికీ తెలిసింది. అప్పటి నుంచే ఈ కిన్నౌర్​ కైలాస్​​ యాత్రను చేపడుతున్నారు జనం. "

-మాల్​వర్​ నేగి, స్థానికుడు

ఇదీ చదవండి:భర్త నమ్మకమే నిజమైంది.. 14ఏళ్లకు తిరిగొచ్చింది

ABOUT THE AUTHOR

...view details