తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారు నుంచి రోడ్డుపై పడిన చిన్నారి..తప్పిన ప్రమాదం - కేరళకు చెందిన IPSఅధికారి

వేగంగా వెళుతోన్న కారులో నుంచి ఓ చిన్నారి రోడ్డుపై పడిపోయిన ఘటన కేరళలో జరిగింది. మూల మలుపు వద్ద కారు డోరు తెరుచుకోవటం వల్ల బాలుడు కింద పడిపోయాడు. ఈ దృశ్యాలను ఓ ఐపీఎస్​ అధికారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయగా.. వైరల్​గా మారాయి.

The child who got out of the car .. What happened after that?
కారులో నుంచి బయట పడిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందీ?

By

Published : Jan 10, 2020, 8:31 PM IST

కారులో నుంచి బయట పడిన చిన్నారి.. ఆ తర్వాత ఏం జరిగిందీ?

చిన్నపిల్లలతో కలిసి కారులో ప్రయాణించేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియజేస్తూ.. కేరళకు చెందిన ఓ ఐపీఎస్​ అధికారి వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ఓ వ్యక్తి కుమారుడితో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. కారు డోరు లాక్‌ చేయకపోవటం వల్ల మలుపు వద్ద డోర్‌ తెరచుకొని బాలుడు కిందపడ్డాడు. ఈ ఘటనలో అదృష్టం కొద్దీ బాలుడు స్వల్ప గాయాలతో బతికిబయటపడ్డాడు.

ఆ బాలుడు కారులో నుంచి కిందపడే సమయానికి ఎదురుగా బస్సు, బైక్‌.. పక్కనుంచి ఓ ఆటో వచ్చింది. బాలుడు కిందపడగానే అందరూ సడన్‌ బ్రేక్‌ వేయటం వల్ల అతనికి ప్రమాదం తప్పింది.

ఇదీ చూడండి:నానాజాతి సమితికి వందేళ్లు.. భారత్​ సాధించిందేమిటి?

ABOUT THE AUTHOR

...view details