ఓ యువ వ్యాపారవేత్తను పట్టపగలే అందరూ చూస్తూ ఉండగా దారుణంగా హత్యచేసిన ఘటన కర్ణాటక మంగుళూరులో జరిగింది. మల్కి ఏరియాలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు సమీపంలో అబ్దుల్ లతీఫ్ అనే యువ వ్యాపారవేత్తపై ఎనిమిది మంది దుండగులు దాడిచేశారు. వారి నుంచి తప్పించుకోవడానికి బాధితుడు బ్యాంకులోకి పరుగెత్తాడు. కానీ అతడ్ని వెంబడించిన దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. పలుమార్లు అతడ్ని పొడిచారు. బాధను తట్టుకోలేక అతను బ్యాంకు మెట్లపైనే విలవిలలాడాడు. చుట్టు పక్కల చాలా మంది ఉన్నా ఎవరూ బాధితుడికి సాయం చేయలేదు. దీనితో ఘటనా స్థలంలోనే అతను చనిపోయాడు.
లైవ్ వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య - The brutal murder of Young Businessman in karnataka
ఎనిమిది మంది దుండగులు ఓ యువ వ్యాపారవేత్తను పట్టపగలే కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన కర్ణాటక మంగుళూరు మల్కి ఏరియాలో జరిగింది. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

పట్టపగలే యువ వ్యాపారవేత్త దారుణ హత్య
పట్టపగలే యువ వ్యాపారవేత్త దారుణ హత్య
ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కొంత మంది తమ సెల్ఫోన్లో ఈ దారుణ హత్య దృశ్యాలను చిత్రీకరించారు. రంగంలోకి దిగిన పోలీసులు వీడియో ఫుటేజీలను సేకరించి.. వాటి ఆధారంగా నలుగురు నిందితులు ముహమ్మద్ హసీమ్, మహ్మద్ రజీమ్, నిస్సార్, అబూబకర్ సిద్ధిక్లను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:మహిళల వివాహ వయస్సు పెంపు!
TAGGED:
abdul lateef murder