తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సొంత బిడ్డను సంచిలో దాచి.. ఆపై!

కర్ణాటకలోని బెల్లందుర్​లో ఓ ప్రబుద్ధుడు.. భార్యను భయపెట్టడానికి సొంత బిడ్డనే అస్త్రంగా చేసుకున్నాడు.  మందు తాగొద్దంటూ భార్య గొడవ చేస్తోందని.. సొంత బిడ్డను సంచిలో దాచాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.

the-alchoholic-father-put-his-baby-into-bag-to-fear-his-wife
సొంత బిడ్డను సంచిలో దాచి.. ఆపై!

By

Published : Feb 6, 2020, 12:29 PM IST

Updated : Feb 29, 2020, 9:39 AM IST

మందుబాబులు.. వారి భార్యల మధ్య జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. రోజు తాగి రావడం.. గొడవ పడటం సాధారణం. భార్య గోల తట్టుకోలేక మందు మానేద్దాం అనుకునే భర్తలు కొందరైతే.. 'భార్యనైనా వదులుకుంటా కానీ బాటిల్​ను వదులుకోను' అనేవారు ఇంకొందరు. ఈ రెండో రకానికి చెందిన ఓ భర్త... భార్యను భయపెట్టడానికి సొంత బిడ్డనే సంచిలో దాచిపెట్టి చివరకు పోలీసులకు చిక్కాడు.

కర్ణాటకలోని బెల్లందుర్​కు చెందిన సుశీల్​ కుమార్​కు మద్యం అలవాటు విపరీతంగా ఉంది. దీనితో సుశీల్​.. అతడి భార్యకు నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవి. భార్య అరుపులతో విసుగెత్తిన సుశీల్​.. ఆమెను భయపెట్టాలనుకున్నాడు. ఇందుకోసం సొంత బిడ్డనే అస్త్రంగా చేసుకున్నాడు.

సుశీల్​ ఆ చిన్నారిని సంచిలో దాచి స్కూటర్​ ముందు భాగంపై పెట్టాడు. ఇది గమనించిన ఓ యువతి.. బిడ్డను అపహరిస్తున్నాడనుకుంది. వెంటనే ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్​ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఫొటో ఆధారంగా గాలింపు చేపట్టారు. చివరికి ఓ మాల్​ వద్ద సుశీల్​ను పట్టుకున్నారు. భార్యను భయపెట్టడానికే ఇలా చేసినట్టు అంగీకరించాడు సుశీల్​. మరోసారి ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ.. ఆ మందుబాబును పోలీసులు మందలించి వదిలేశారు.

ఇదీ చూడండి- శాడిస్ట్​ భర్త: భార్యపై అనుమానంతో కత్తిరించాడు

Last Updated : Feb 29, 2020, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details