కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ తిరువనంతపురం సిట్టింగ్ ఎంపీ శశి థరూర్‌కు ప్రమాదవశాత్తు తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
తులాభారంలో థరూర్ తలకు గాయం - temple
కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. మలయాళ నూతన సంవత్సరం సందర్భంగా ఓ ఆలయంలో తులాభారం నిర్వహిస్తుండగా త్రాసు దండం తలపై పడింది. థరూర్‌ను హూటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మలయాళ నూతన సంవత్సరం(విశు) సందర్భంగా తిరువనంతపురం గాంధారి అమ్మాన్ కోవిల్లో పూజలు నిర్వహించారు థరూర్. హిందూ సంప్రదాయం ప్రకారం పంచదారతో తులాభారం నిర్వహించారు. ఈ క్రమంలో త్రాసులో కూర్చున్న ఆయన తలపై దండం పడింది. తలకు తీవ్రగాయమైంది. కాలికి చిన్న దెబ్బ తగిలింది. వెంటనే థరూర్‌ను త్రివేండ్రమ్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. తలకు ఆరు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం థరూర్ ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు.
శశి థరూర్ తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ లక్ష్యంతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు.