కేరళలోని తిరువనంతపురం మేయర్‌గా ఎన్నికైన ఆర్య రాజేంద్రన్.. తనకు మద్దతునిచ్చిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా.. తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు 21ఏళ్ల ఆర్య.
"భాజపా, కాంగ్రెస్‌తో సహా వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు నాకు మద్దతుగా నిలిచారు. ఇంత భారీ స్థాయిలో స్పందన లభిస్తుందని నేను అనుకోలేదు. నా ప్రయాణంలో తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు. ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తాను. యువతీ- యువకుల సమస్యలు.. మహిళా సాధికారత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. వీటితో పాటు సంక్షేమానికి తగిన ప్రాముఖ్యత ఇస్తాను.
- ఆర్య రాజేంద్రన్, తిరువనంతపురం మేయర్.