తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుల్వామాలో భారీ ఉగ్రదాడికి కుట్ర..! - Terrorists plans for one more major attack in Pulwama

Pulwama attack
పుల్వామాలో భారీ ఉగ్రదాడికి కుట్ర..!

By

Published : May 28, 2020, 9:45 AM IST

Updated : May 28, 2020, 11:10 AM IST

11:00 May 28

పుల్వామాలో భారీ ఉగ్రదాడికి కుట్ర

సైన్యం అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం

జమ్ముకశ్మీర్‌లో సైన్యం, సీఆర్పీఎఫ్, పోలీసులు చొరవతో అతిపెద్ద ప్రమాదం తప్పింది. శక్తిమంతమైన పేలుడు పదార్థాలతో కూడిన కారును గుర్తించిన భద్రతా బలగాలు తగిన సమయంలో స్పందించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా నిలువరించగలిగాయి.

తనిఖీలతో వెలుగులోకి

తీవ్రవాదులు తిరుగుతున్నారనే సమాచారంతో పుల్వామా పోలీసులు వాహనాలు తనిఖీ చేసే కేంద్రం వద్ద రాత్రి ఒక తెల్ల కారును ఆపారు. పోలీసులను చూసిన డ్రైవర్.. మరింత వేగంగా ముందుకు కదిలాడు. వెంటనే కారుపై పోలీసులు, అక్కడే ఉన్న సైనికులు కాల్పులు జరిపారు. బలగాలు కారును వెంబడించగా కొంతదూరం వెళ్లిన తర్వాత డ్రైవర్‌ వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి పారిపోయాడు. కారుకు ఐఈడీ అమర్చినట్లు గుర్తించిన సైనిక బలగాలు.. బాంబు నిర్వీర్య దళాలను రప్పించాయి. ముందు జాగ్రత్తగా కారు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఉదయం వరకూ వేచి చూసిన బాంబు నిర్వీర్యదళం... కారును అక్కడి నుంచి తరలిస్తే ప్రమాదమని ఈ ఉదయం అక్కడే పేల్చి వేసింది.

09:40 May 28

పుల్వామాలో భారీ ఉగ్రదాడికి కుట్ర..!

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో తీవ్రవాదులు మరో ఉగ్రకుట్రకు వ్యూహాలు రచిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో దాడిని భగ్నం చేశాయి సీఆర్​పీఎఫ్​, సైనిక బలగాలు. శక్తివంతమైన పేలుడు పదార్థాలతో కూడిన కారును గుర్తించిన భద్రతా బలగాలు తగిన సమయంలో స్పందించి పేలకుండా చేయగలిగారు. ఓ వాహనంలో ఐఈడీ బాంబులను అమర్చి దాడి చేయాలని వ్యూహరచన చేశారని చెప్పారు పోలీసులు. గతేడాది పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ సిబ్బంది వాహనంపై చేసిన దాడి తరహాలోనే తీవ్రవాదులు మరోసారి ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. 

ఈ ఉగ్రదాడి వ్యూహ రచనలో లష్కరే, జైషే మహ్మద్​ ఉగ్రసంస్థల హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న సీఆర్​పీఎఫ్​ సిబ్బంది వాహనంపై దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 40 మందికిపైగా సైనికులు అమరులయ్యారు.

Last Updated : May 28, 2020, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details