జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లా లుక్బవన్ ప్రాంతంలో ఓ కశ్మీరీ పండిత్పై కాల్పులు జరిపి, బలిగొన్నారు.
సాయంత్రం 6 గంటల సమయంలో లర్కిపొరా ప్రాంత సర్పంచ్ అజయ్ పండిత్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
అయితే ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకు బాధ్యత ప్రకటించుకోలేదు.