మరో సైనికుడు...
జమ్ముకశ్మీర్‌లోని సోపోర్ పట్టణంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.
18:45 April 18

సీఆర్పీఎఫ్- జమ్ముకశ్మీర్ పోలీసుల 179వ బెటాలియన్ సంయుక్తంగా గస్తీ కాస్తున్న చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. వారం రోజుల వ్యవధిలో ముష్కరులు దాడి చేయడం ఇది మూడోసారి.
18:11 April 18
ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికుల మృతి
జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లా సోపోర్ సెక్టార్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.