తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీరీలను భయపెడుతున్న ఉగ్రవాదులు అరెస్ట్ - లష్కరే తోయిబా

కశ్మీర్​ బారాముల్లా జిల్లాలోని సోపోర్​​ ప్రాంతంలో ఎనిమిది మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. కశ్మీర్​లో కేంద్రం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించాలని స్థానిక ప్రజలను భయపెడుతున్నందుకు అరెస్టు చేశారు.

కశ్మీర్​ ప్రజలను భయపెడుతున్న ఉగ్రవాదులు అరెస్టు!

By

Published : Sep 10, 2019, 4:16 PM IST

Updated : Sep 30, 2019, 3:29 AM IST

కశ్మీర్​ బారాముల్లా జిల్లాలోని సోపోర్​ ప్రాంతంలో లష్కరే తోయిబాకు చెందిన ఎనిమిది మంది ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అనంతరం.. కేంద్రం ఆంక్షలకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించాలని ప్రజలను భయపెడుతున్నందుకు వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఈ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాలంటూ స్థానికులను ముష్కరులు బెదిరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సోపోర్​లో గతవారం తీవ్రవాదులు ఓ ఇంటిపై జరిపిన దాడుల్లో పసిపాపతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయపడ్డారు. మొదటగా హమీదుల్లా అనే పండ్ల వ్యాపారిని బెదిరించటానికి ముష్కరులు అతని ఇంటికి వెళ్లారు. ఆ వ్యాపారి ఇంట్లో లేకపోయినందున రెండున్నరేళ్ల చిన్నారితో సహా హమీదుల్లా కుటుంబానికి చెందిన నలుగురిని గాయ గాయపరిచారు. గాయపడిన వారిలో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చూడండి:రైల్వే బంపర్​ ఆఫర్​: ప్లాస్టిక్ ఇస్తే ఫ్రీగా మొబైల్​ రీఛార్జ్​

Last Updated : Sep 30, 2019, 3:29 AM IST

ABOUT THE AUTHOR

...view details