జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
జిల్లాలోని కలకోటే ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టాయి బలగాలు. సైనికులను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య జరిగిన పోరులో ఒక తీవ్రవాదిని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు.