భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి భద్రత బలగాలు. జమ్ముకశ్మీర్‌లోని పుంఛ్ జిల్లా సూరన్‌కోట్ ప్రాంతంలో ముష్కరుల రహస్య స్థావరాలను పసిగట్టి, ధ్వంసం చేశాయి. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నాయి. సైన్యం.. ముష్కర వేట కొనసాగిస్తోంది.
కశ్మీర్లో ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వంసం - Terrorist hideout busted
కశ్మీర్ పుంఛ్ జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ఛేదించాయి భద్రత బలగాలు. ఆ స్థావరాన్ని ధ్వంసం చేసిన అధికారులు.. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
![కశ్మీర్లో ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వంసం Terrorist hideout busted in J-K's Poonch, arms and ammunition recovered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9050354-thumbnail-3x2-terrorist.jpg)
ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వంసం
కశ్మీర్ పోలీసులు, భద్రత బలగాలు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో దీన్ని ఛేదించారు. అనంతరం ఆ ప్రాంతంలో ఇంకేమైనా రహస్య స్థావరాలు ఉన్నాయేమోనని తనిఖీ చేస్తున్నారు.
ఇదీ చూడండి:భాజపాలో చేరిన దిగ్విజయ్ సింగ్ కుమార్తె!