గణతంత్ర వేడుకలకు ముందు అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు వెల్లడైంది. జమ్ముకశ్మీర్‌లోని సైనిక స్థావరాలపై దాడి చేయడమే లక్ష్యంగా జైష్-ఎ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు కలిసి ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసింది.
యాపిల్ తోటల్లో రహస్య భేటీ..
జైష్-ఎ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థల ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగినట్లు నిఘా వర్గాలు కనుగొన్నాయి. పుల్వామాలోని యాపిల్ తోటల్లో 8 మంది ముష్కరులు సమావేశమై... దాడి ప్రణాళికపై చర్చించినట్లు తెలుసుకున్నాయి. ఈ 8 మంది ఉగ్రవాదుల్లో ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులని గుర్తించాయి. షోపియాన్‌లోని సైనిక స్థావరంపై దాడి చేయాలన్నదే వీరి ఆలోచనగా భావిస్తున్నాయి