తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉగ్రవాదం వల్ల అలాంటి మరో మారణహోమం' - Ashish Sharma

ఉగ్రవాదం ప్రపంచానికి పెనుసవాలుగా మారుతోందని ఐక్యరాజ్య సమితి వేదికగా మరోమారు నొక్కిచెప్పింది భారత్​. సమకాలీన ప్రపంచంలో యుద్ధం చేసే సాధనాల్లో ఉగ్రవాదం ఒకటిగా మారిందని, రెండు ప్రపంచ యుద్ధాల్లో చూసినటువంటి మారణహోమంలోకి ప్రపంచాన్ని నెడుతోందని హెచ్చరించింది. అంతర్జాతీయ చర్యలతోనే ఓడించటం సాధ్యమవుతుందని సూచించింది.

United nations
ఐక్యరాజ్య సమితి

By

Published : Dec 2, 2020, 12:29 PM IST

సమకాలీన ప్రపంచంలో యుద్ధ చేసే సాధనాల్లో ఉగ్రవాదం ఒకటిగా మారిందని పేర్కొంది భారత్​. రెండు ప్రపంచ యుద్ధాల తరహాలోనే ప్రపంచాన్ని మారణహోమంలోకి నెడుతోందని హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు అంతర్జాతీయంగా చర్యలు అవసరమని ఐక్యరాజ్య సమితి వేదికగా పిలుపునిచ్చింది భారత్​.

రెండో ప్రపంచ యుద్ధ బాధితుల జ్ఞాపకార్థం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు ఐరాసలో భారత శాశ్వత మిషన్​ కార్యదర్శి ఆశిష్​ శర్మ.

" ప్రాథమిక సూత్రాలకు, ఐక్యరాజ్య సమితి ఉద్దేశానికి కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని రెండో ప్రపంచ యుద్ధం 75 వార్షికోత్సవం సూచిస్తోంది. దాని ద్వారా యుద్ధాల నుంచి భవిష్యత్తు తరాలకు రక్షణ లభిస్తుంది. సమకాలీన ప్రపంచంలో యుద్ధం చేసే సాధనాల్లో ఉగ్రవాదం ఒకటిగా మారింది. అది రెండో ప్రపంచ యుద్ధంలో ఎదురైనటువంటి మారణహోమంలోకి ప్రపంచాన్ని నెడుతోంది. ఉగ్రవాదం అనేది అంతర్జాతీయ అంశం. దానిని అంతర్జాతీయ చర్యలతోనే ఓడించటం వీలవుతుంది. "

- ఆశిష్​ శర్మ, ఐరాసలో భారత శాశ్వత మిషన్​ మొదటి కార్యదర్శి

ఆధునిక పద్ధతుల్లోని యుద్ధాలను ఎదుర్కొనేందుకు, శాంతియుతమైన, సురక్షితమైన ప్రపంచం కోసం సిద్ధం కావాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు ఆశిష్​ శర్మ. భారత ఉపఖండంలో రెండో ప్రపంచ యుద్ధం అత్యధికంగా సైన్యం పాలుపంచుకున్న ఘటనగా మిగిలిపోయిందన్నారు. వలసవాదుల చెరలో ఉన్నప్పటికీ.. ఉత్తర ఆఫ్రికా నుంచి ఐరోపా​ వరకు రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ నుంచి​ 25 లక్షల మంది సైనికులు పాలుపంచుకున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: అఫ్గాన్‌లో ఆగని హింస.. తాలిబన్ల ద్వంద్వ ప్రమాణాలు!

ABOUT THE AUTHOR

...view details