తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లోనూ ఉగ్రకలకలం... భద్రత కట్టుదిట్టం - నిఘా సమాచారం

సముద్రమార్గం ద్వారా పాక్​ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్​లో చొరబడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో గుజరాత్​ తీరప్రాంతంలోని కాండ్ల, ముంద్రా పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బీఎస్​ఎఫ్​, తీర రక్షణ దళాలు గస్తీని ముమ్మరం చేశాయి. మరోవైపు తమిళనాడులోనూ ఉగ్రవాదుల ఆచూకీ కోసం విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి.

ఉగ్రవాదుల చొరబాటు యత్నాలతో... భద్రత కట్టుదిట్టం

By

Published : Aug 29, 2019, 3:31 PM IST

Updated : Sep 28, 2019, 6:02 PM IST

ఉగ్రవాదుల చొరబాటు యత్నాలతో... భద్రత కట్టుదిట్టం

పాకిస్థాన్​ ప్రేరేపిత ఉగ్రవాదులు గుజరాత్​లోని కచ్​ తీరప్రాంతం నుంచి భారత్​లోకి చొరబడే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో కచ్​ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా కాండ్ల, ముంద్రా ఓడరేవుల వద్ద నిఘా పెంచారు.

సముద్రమార్గం వెంబడి ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని రెండు రోజుల క్రితం భారత నావికా దళం కూడా హెచ్చరించింది. ప్రస్తుతం బీఎస్​ఎఫ్​, భారత తీరప్రాంత రక్షణ దళం గస్తీని ముమ్మరం చేశాయి.

ముంద్రా, కాండ్లల్లో

అదానీ గ్రూప్​ నిర్వహిస్తోన్న ముంద్రా నౌకాశ్రయం.. దేశంలోనే అతిపెద్ద పోర్టుల్లో ఒకటి. ఇక్కడ నుంచి భారీ పరిమాణంలో రవాణా జరుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కాండ్లా నౌకాశ్రయం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నౌకాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కచ్​ తీరంలోని జామ్​నగర్​లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఉంది. దీనిని రిలయన్స్ ఇండస్ట్రీస్​ నిర్వహిస్తోంది. వాదినర్​లో రష్యా దిగ్గజ కంపెనీ నడుపుతున్న మరో చమురు శుద్ధి కర్మాగారం కూడా ఇదే ప్రాంతంలో ఉంది.

ఐఎన్ఏ సోదాలు

ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా సమాచారంతో... తమిళనాడు కోయంబత్తూరులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విస్తృత సోదాలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితుల నుంచి సెల్​ఫోన్లు, ల్యాప్​టాప్​లు, సిమ్​కార్డులు, పెన్​డ్రైవ్​లను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: భారత్​కు త్వరలో 'యాపిల్'​ ఆన్​లైన్​ స్టోర్!

Last Updated : Sep 28, 2019, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details