తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో రెచ్చిపోయిన ముష్కరులు-ఐదుగురు మృతి - కశ్మీర్​యేతర కూలీలపై కాల్పులు

కశ్మీర్​లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

By

Published : Oct 29, 2019, 9:39 PM IST

Updated : Oct 29, 2019, 10:47 PM IST

22:11 October 29

కశ్మీర్​లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

ఐరోపా సమాఖ్య ప్రతినిధులు పర్యటిస్తున్న వేళ కశ్మీర్​లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా కుల్గాం జిల్లాలో పనిచేస్తున్న రోజువారీ కూలీలు ఐదుగురిని అపహరించి.. అనంతరం వారిని చంపేశారు. ఒకరిని గాయాలతో వదిలేశారు. బాధితులు బంగాల్​లోని ముర్షిదాబాద్​కు చెందినవారని పోలీసులు వెల్లడించారు. 

ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. తనిఖీలు చేపట్టేందుకు అదనపు బలగాలను రప్పించారు అధికారులు. గత రెండు వారాల్లో కశ్మీర్​లో ఇది ఆరో ఉగ్రదాడి.

ఆర్టికల్ 370 రద్దు అనంతరం వాహన చోదకులు, కూలీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు ముష్కరులు. ఉదంపుర్ జిల్లాలో సోమవారం ఓ వాహన చోదకుడిపై కాల్పులు చేసి చంపారు. షోపియాన్​ జిల్లాలో ఈ నెల 24న ఇద్దరు, 14వ తేదిన ఒకరు.. మొత్తం ముగ్గురు వాహన చోదకులను పొట్టన పెట్టుకున్నారు. అంతకుముందు ఓ ఆపిల్ వ్యాపారిని.. ఓ ఇటుకలు తయారు చేసే వ్యక్తిని కాల్చిచంపారు.  

21:30 October 29

జమ్ము కశ్మీర్​లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. కుల్గాం జిల్లాలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన రోజువారీ కూలీలు ఐదుగురిని అపహరించిన ముష్కరులు అనంతరం వారిని చంపేశారు.   గత రెండు రోజుల్లో ఇది ఆరో ఉగ్రదాడి.

Last Updated : Oct 29, 2019, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details