పాలిటెక్నిక్ చదివే విద్యార్థుల వయసెంత ఉంటుందంటారు... ఓ 17 నుంచి 19 ఏళ్ల మధ్య కదూ. ఆ వయసులోనే గ్యాంగ్స్టర్లుగా మారి దాడులకు పాల్పడితే... కత్తులతో చంపేందుకు యత్నిస్తే... ఒకసారి ఊహించుకోండి... ఎటుపోతోందీ సమాజం అని వైరాగ్యం కలుగుతోంది కదూ. తమిళనాడులో అచ్చం ఇలాంటి సంఘటనే జరిగింది.
స్థానిక పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పెరియార్ స్టాపు వద్ద బస్సెక్కారు. కండక్టర్ టికెట్లు తీసుకోమని కోరారు. కానీ.. తీసుకునేందుకు మొండికేసిన వారు అతడితో వాదనకు దిగారు. వివాదం ముదిరి దాడికి దారితీసింది. తమ బ్యాగులోని కత్తితో విద్యార్థులు కండక్టర్పై విరుచుకుపడి అక్కడినుంచి పరారయ్యారు.
బాధితుడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.