ఇంటి అద్దె అడిగిన యజమానిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన తమిళనాడులో చెన్నై సమీపంలోని కుండ్రటూరులో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం, గుణశేఖరన్ ఇంట్లో ధనరాజ్ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఈ క్రమంలో గుణశేఖరన్ నాలుగు నెలల అద్దె చెల్లించాలని ధనరాజ్‌ను అడిగాడు. అయితే ఇది కాస్త గొడవకు దారితీసింది.
అద్దె అడిగాడని కోపోద్రిక్తుడైన ధనరాజ్ కుమారుడు అజిత్.. అర్ధరాత్రి సమయంలో ఇంటి యజమానిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు.
నిందితుడు అజిత్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు... కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్