తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నాలుగు నెలల్లో ఆకాశాన్నంటే రామమందిర నిర్మాణం' - అమిత్ షా

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కేవలం నాలుగు నెలల్లోనే ఆకాశాన్నంటే రామమందిరాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అయోధ్య అంశంలో కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు.

temple-in-ayodhya-to-come-up-within-four-months-shah
'నాలుగు నెలల్లో ఆకాశాన్నంటే రామమందిర నిర్మాణం'

By

Published : Dec 16, 2019, 4:53 PM IST

Updated : Dec 16, 2019, 8:34 PM IST

'నాలుగు నెలల్లో ఆకాశాన్నంటే రామమందిర నిర్మాణం'

అయోధ్యలో కేవలం నాలుగు నెలల్లోనే ఆకాశాన్నంటే రామమందిరాన్ని నిర్మిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. రాముడి జన్మస్థలంలో మందిర నిర్మాణం కోసం ప్రజలు ఎన్నో ఏళ్లుగా వేచి చూశారని ఉద్ఘాటించారు. ఝార్ఖండ్​లోని పాకుర్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా.. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినందున నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతాయని స్పష్టం చేశారు.

"రాముడు జన్మించిన ప్రదేశంలోనే రామమందిర నిర్మాణం చేపట్టాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినందున నాలుగు నెలల్లోనే ఆకాశాన్నంటే రామమందిరాన్ని నిర్మిస్తాం."-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు షా. అయోధ్య కేసు ముగిసిన అంశమని.. దాన్ని తిరిగి సుప్రీంలోకి లాగడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్​ను ప్రశ్నించారు.

20 అడుగుల లోతులో నక్సలిజం

హేమంత్​ సొరెన్​ నేతృత్వంలోని జేఎంఎం అధికారంలో ఉన్నప్పుడు ఝార్ఖండ్​లో నక్సలిజాన్ని ఎందుకు అంతమొందించలేదని ప్రశ్నించారు అమిత్ షా. వాజ్​పేయీ హయాంలోని భాజపా ప్రభుత్వమే ఝార్ఖండ్​ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నక్సలిజాన్ని 20 అడుగుల లోతులో పాతిపెట్టారన్నారు.

Last Updated : Dec 16, 2019, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details