తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్​లో దడ పుట్టిస్తున్న ఎండలు

రాజస్థాన్​లో వేసవి ఉష్ణోగ్రతలు ప్రజానీకాన్ని వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని చురులో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వరుసగా మూడో రోజూ ఎక్కువ ఉష్ణోగ్రతను నమోదు చేసింది చురు.

By

Published : Jun 4, 2019, 12:00 AM IST

Updated : Jun 4, 2019, 12:35 AM IST

రాజస్థాన్​లో దడ పుట్టిస్తున్న ఎండలు

రాజస్థాన్​లో దడ పుట్టిస్తున్న ఎండలు

గత కొద్ది రోజులుగా రాజస్థాన్​లో వేసవి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. సోమవారం ఆ రాష్ట్రంలోని చురులో 50.3 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వరుసగా మూడు రోజులు చురులో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని పలు పట్టణాల్లో సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతోంది.

శ్రీగంగానగర్​లో 48.8 డిగ్రీలు, బికనీర్​లో 48.4, కోటాలో 47.4, జైసల్మేర్​లో 47, బార్మర్​లో 46.6, జైపుర్​లో 45.8, అజ్మీర్​లో 45.5, జోధ్​పుర్​లో 45.4, దబోక్​లో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

మరో రెండు రోజుల పాటు పరిస్థితి ఈ విధంగానే కొనసాగుతుందని వాతవరణ శాఖ వెల్లడించింది.

ఇప్పటివకు దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డూ రాజస్థాన్​లోనే నమోదయింది. 2016, మే 19లో రాజస్థాన్​లోని పలోదిలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

ఇదీ చూడండి: 'ఓట్ల కోసం కూటమి పార్టీలపై ఆధారపడొద్దు'

Last Updated : Jun 4, 2019, 12:35 AM IST

ABOUT THE AUTHOR

...view details