తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలోని ఆకర్షణీయ నగరాల్లో 'హైదరాబాద్​' టాప్​ - భారత్​లోని ఆకర్షణీయ నగరాల్లో 'హైదరాబాద్​' అగ్రస్థానం

భారత్​లోని ఆకర్షణీయ నగరాల జాబితాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్​ అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 102 నగరాలపై నిర్వహించిన సర్వేలో హైదరాబాద్​కు 67వ స్థానం (ప్రపంచ ర్యాంకు) దక్కింది.

భారత్​లోని ఆకర్షణీయ నగరాల్లో 'హైదరాబాద్​' అగ్రస్థానం

By

Published : Oct 5, 2019, 6:15 AM IST

Updated : Oct 5, 2019, 7:38 AM IST

హైదరబాద్​కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ స్మార్ట్​ సిటీలు (ఆకర్షణీయ నగరాలు) జాబితాలో స్థానం దక్కించుకుంది. దేశంలోని మూడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్​ అగ్రస్థానాన నిలిచింది. ఆ తరువాత దిల్లీ, ముంబయిలు ఉన్నాయి.

స్విట్జర్లాండ్​కు చెందిన 'ఇంటర్నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మేనేజ్​మెంట్​ డెవలప్​మెంట్'​ ( ఐఐఎండీ), 'సింగపూర్​ యూనివర్సిటీ ఆఫ్​ టెక్నాలజీ అండ్​ డెవలప్​మెంట్​' (ఎస్​యూటీడీ) సంయుక్తంగా ప్రపంచంలోని కొన్ని ఆకర్షణీయ నగరాలను ఎంపిక చేసుకొని అక్కడ పౌరులకు లభించే సేవలను మదించి ర్యాంకులు కేటాయించాయి. ఇందుకోసం నగరాల వారీగా వివరాలు సేకరించాయి.

ర్యాంకులు ఇలా..

ప్రపంచంలోని మొత్తం 102 ఆకర్షణీయ నగరాలకు ర్యాంకులు ఇచ్చాయి. మొత్తం 102 నగరాల్లో హైదరాబాద్​కు 67వ స్థానం (ప్రపంచ ర్యాంకు) లభించింది. దిల్లీకి 68, ముంబయికి 78వ స్థానం దక్కాయి.

తొలి స్థానంలో సింగపూర్​..

ప్రపంచంలో సింగపూర్​ మొదటి స్థానం, జ్యూరిచ్​ (స్విట్జర్లాండ్​) రెండో స్థానంలో నిలిచాయి. ఓస్లో (నార్వే)కు మూడో స్థానం, జెనీవా, కోపెన్​హెగన్​లు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

Last Updated : Oct 5, 2019, 7:38 AM IST

ABOUT THE AUTHOR

...view details