తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ట్రంప్​ వచ్చి బిహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వరు' - బిహార్​ ఎన్నికలు 2020

బిహార్​ ఎన్నికల నేపథ్యంలో మహాకూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​. 15ఏళ్లు పాలించినప్పటికీ..రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో నితీశ్​ కుమార్​ విఫలమయ్యారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 10లక్షల మంది యువతకు ఉద్యోగాలిస్తామని హామీనిచ్చారు తేజస్వీ. అదే సమయంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు బిల్లును ప్రవేశపెడతామని మహాకూటమి తన మేనిఫెస్టోలో పేర్కొంది.

tejashwi-yadav-releases-mahagathbandhans-manifesto-says-trump-will-not-come-to-accord-special-status-to-bihar
'ట్రంప్​ వచ్చి బిహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వరు'

By

Published : Oct 17, 2020, 12:36 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వచ్చి బిహార్​కు ప్రత్యేక హోదాను ప్రకటించరని.. నితీశ్​ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఆర్​జేడీ నేత, మహాకుటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్​. జేడీయూ- భాజపా కలిసి బిహార్​ ప్రజలను వెన్నుపోటు పొడిచాయని ఆరోపించారు.

బిహార్​ ఎన్నికలకు మహాకూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు తేజస్వీ. ఈ సందర్భంగా.. బిహార్​లో ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ నేతృత్వంలోని ఎన్​డీఏ పాలనపై విమర్శలు గుప్పించారు​.

"బిహార్​లో రెండు పార్టీల చేతుల్లో ప్రభుత్వం నడుస్తోంది. రాష్ట్రాన్ని 15ఏళ్ల నుంచి నితీశ్​ కుమార్​ పాలిస్తున్నారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వచ్చి ప్రత్యేక హోదాను ప్రకటించరు. జేడీయూ-భాజపా కలిసి బిహార్​ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. దాదాపు 60 కుంభకోణాలు బయటపడ్డాయి."

--- తేజస్వీ యాదవ్​, ఆర్​జేడీ నేత.

'హామీలు నెరవేరుస్తాం..'

తనను తాను ఓ స్వచ్ఛమైన బిహారీగా అభివర్ణించుకున్నారు తేజస్వీ యాదవ్​. నవరాత్రి ప్రారంభమైన రోజున మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామని.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తేజస్వీ యాదవ్​ వెల్లడించారు. నిరుద్యోగ సమస్యపై పోరాటంతో ముందుకు సాగుతున్నట్టు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:-బిహార్​ బరి: తేజస్వీ ఓటమే లక్ష్యంగా భాజపా వ్యూహం

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

  • అధికారంలోకి వచ్చిన వెంటనే 10లక్షల మంది యువతకు ఉద్యోగాలు. ఇందుకోసం తొలి కేబినెట్​ భేటీలోనే నిర్ణయం.
  • ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పత్రాలు ఉచితంగా అందజేత.
  • పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల రవాణా ఖర్చులను భరించడం.
  • ప్రజలకు సహాయం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 'కరుపురి శ్రమ్​ వీర్​ సహాయత' కేంద్రాల ఏర్పాటు.
  • రాష్ట్రంలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన.
  • 'స్మార్ట్​ గ్రామ్​ యోజన' కింద ప్రతి పంచాయతీలో.. వైద్యుడు, నర్సుతో కూడిన క్లీనిక్ ఏర్పాటు​.
  • వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు తొలి శాసనసభ సమావేశంలోనే బిల్లు.

కాంగ్రెస్​, సీపీఐ, సీపీఎమ్​లు మహాకూటమిలో భాగంగా ఉన్నాయి. తేజస్వీ యాదవ్​ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ముందుకు సాగుతోంది. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్​ నేత రణ్​దీప్​ సుర్జేవాలా, శక్తిసిన్హ గోహిల్​తో పాటు ఇతరులు పాల్గొన్నారు.

మాహాకూటమి మేనిఫెస్టో విడుదల కార్యక్రమం

243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 28, వచ్చే నెల 3,7 తేదీల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే నెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి:-బిహార్​ ఎన్నికల సమరంలో 'మోదీ డూప్​'

ABOUT THE AUTHOR

...view details