తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నితీశ్ అవినీతిని మోదీనే బయటపెట్టారు: తేజస్వీ - బిహార్​

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని ప్రభుత్వంలో 60 కుంభకోణాలు జరిగాయని మరోమారు విమర్శలు చేశారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​. రూ.30వేల కోట్ల విలువైన ఈ కుంభకోణాలకు ఆధారమిదే అంటూ ప్రధాని మోదీ మాట్లాడుతున్న ఓ వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేశారు.

Tejashwi Yadav
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్​

By

Published : Oct 31, 2020, 5:16 PM IST

ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వంలో 60 కుంభకోణాలు చోటుచేసుకున్నాయని శనివారం మహాగట్‌ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ విమర్శలు చేశారు. వాటి విలువ రూ.30 వేల కోట్లు ఉంటుందని వెల్లడించడం సహా..వాటికి ఆధారమిదే అంటూ ప్రధాని మోదీ మాట్లాడుతున్న వీడియో ఒకదాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 30కుపైగా కుంభకోణాలకు పాల్పడిందంటూ మోదీ వ్యాఖ్యానించడం అందులో కనిపిస్తుంది.

"గౌరవనీయులైన నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వంలో 60కిపైగా కుంభకోణాలు జరిగాయి. వాటి విలువ 30వేల కోట్లకు పైమాటే. వాటిలో 33 కుంభకోణాల గురించి ఐదు సంవత్సరాల క్రితం స్వయంగా ప్రధాని మోదీనే వెల్లడించారు. మీకోసం ఒకసారి దీన్ని వినండి"

- తేజస్వీ యాదవ్​, ఆర్జేడీ నేత

తేజస్వీ షేర్​ చేసిన వీడియోలో.. బిహార్ ప్రజలకు తెలిసిన విషయాలను ఇక్కడి యువతకు కూడా గుర్తుచేయాలనుకుంటున్నానంటూ మోదీ మాట్లాడారు. ఇంజినీరింగ్ కళాశాలలు, మద్యం అమ్మకాలు, మధ్యాహ్న భోజన పథకం..ఇలా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి ఆయన అందులో ప్రస్తావించారు. అయితే, ఆ విమర్శలు ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించినవో మాత్రం స్పష్టత లేదు.

ఇదీ చూడండి: '9 మంది పిల్లల'పై రాజకీయ దుమారం

ABOUT THE AUTHOR

...view details