ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై కేంద్రమంత్రి అశ్వినీ చౌబే తీవ్ర విమర్శలు చేశారు. కేబినెట్ పదానికి స్పెల్లింగ్ కూడా చెప్పలేని తేజస్వీ.. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను విమర్శిస్తున్నారా? అంటూ ఎద్దేవా చేశారు.
"పదో తరగతి కూడా పాస్ కాని ఒక వ్యక్తి.. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన నితీశ్ కుమార్‌ను విమర్శిస్తున్నారు. ఆయనకు కనీసం కేబినెట్ స్పెల్లింగ్ కూడా రాయడం రాదు. ఆయన తండ్రి లక్ష ఉద్యోగాలు కల్పిస్తానని మొదటి కేబినెట్ సమావేశంలో హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ ఉద్యోగ దరఖాస్తులు అక్కడ చెత్త బుట్టలోనే ఉన్నాయి. ఉద్యోగాల పేరు చెప్పి డబ్బులు మాత్రం వసూలు చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి తప్పుడు హామీలు మాత్రమే ఇస్తుంది. వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి."
- అశ్వినీ చౌబే, కేంద్రమంత్రి