పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ యుద్ధవిమానాన్ని శుక్రవారం విజయవంతంగా పరీక్షించారు. తేజస్‌ను త్వరలో నేవీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో..గోవాలోని ఓ తీరప్రాంత పరీక్ష కేంద్రం నుంచి యుద్ధవిమాన వాహకనౌకపై దిగే సామర్థ్యాన్ని పరీక్షించారు. డీఆర్డీవో, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సంయుక్తంగా తేజస్‌ను అభివృద్ధి చేశాయి. ఫ్యూజ్‌లేజ్‌లో అమర్చిన వైర్ల ద్వారా తక్కువ దూరంలోనే దిగగలిగే సామర్థ్యాన్ని తేజస్ విజయవంతంగా ప్రదర్శించినట్లు నిపుణులు చెప్పారు. ఈ విజయంపై స్పందించిన రక్షణ శాఖ.. భారత నావికా విమానయాన చరిత్రలో ఓ గొప్ప రోజుగా అభివర్ణించింది.
తేజస్ 'ల్యాండింగ్' పరీక్ష విజయవంతం.. త్వరలో నేవీలో! - defence
గోవాలోని తీరప్రాంత పరీక్ష కేంద్రంలో తేజస్ యుద్ధవిమానాన్ని విజయవంతంగా పరీక్షించారు. త్వరలో నావికాదళంలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ విజయంపై రక్షణ శాఖ స్పందించింది. ఇదొక గొప్ప రోజు అని అభివర్ణించింది.
తేజస్ 'ల్యాండింగ్' పరీక్ష విజయవంతం.. త్వరలో నేవీలో!
Last Updated : Sep 30, 2019, 1:15 PM IST