తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తొలిరోజే 3 సార్లు 'తేజస్' గొలుసు లాగేశారు!​ - దిల్లీ-లఖ్​నవూ తేజస్​ ఎక్స్​ప్రెస్ తొలి ప్రయాణం ఆటంకాలతో సాగింది. తొలిరోజే మూడు సార్లు గొలుసు లాగడం, ఓ సారి నిరసనకారులు అడ్డుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ప్రైవేట్​ ఆపరేటర్ల చేతుల్లోకి వెళ్లిన తేజస్ ఎక్స్​ప్రెస్​ ప్రయాణం ఆటంకాలతో మొదలైంది. ప్రారంభంలోనే మూడు సార్లు గొలుసు లాగడం వల్ల ఆగిపోయింది. మరోసారి రైళ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... కార్మికులు ధర్నాకు దిగి అడ్డుకున్నారు.

తొలిరోజే 3 సార్లు 'తేజస్' గొలుసు లాగేశారు!​

By

Published : Oct 4, 2019, 7:40 PM IST

Updated : Oct 4, 2019, 8:55 PM IST

తొలిరోజే 3 సార్లు 'తేజస్' గొలుసు లాగేశారు!​
భారతీయ రైల్వే చరిత్రలో తొలి ప్రైవేటు రైలుగా పేరుగాంచిన దిల్లీ-లఖ్​నవూ తేజస్​ ఎక్స్​ప్రెస్ తొలి ప్రయాణం ఆటంకాలతో సాగింది. తొలిరోజే మూడు సార్లు గొలుసు లాగడం, ఓ సారి నిరసనకారులు అడ్డుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

కాన్పుర్​లో తేజస్ ఎక్స్‌ప్రెస్ దిల్లీకి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ప్రైవేటు క్యాటరింగ్​ సిబ్బంది ఆహార క్యాన్లను ఎక్కించేందుకు గొలుసు లాగారు. ఆ తర్వాత రైలు బయల్దేరి సెంట్రల్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెంబర్ 9 కి చేరుకుంది. మళ్లీ ఎవరో గొలుసు లాగారు. తేజస్​ కాసేపు ఆగింది. మళ్లీ బయలుదేరి కొంచెం దూరం కదిలేసరికి ఓ ప్రయాణికుడు రైలెక్కలేదని, వారి బంధువులు చైన్ లాగారు. ఆర్పీఎఫ్​ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళనలతో...

రైల్వేను ప్రైవేటీకరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తూ ఘజియాబాద్‌లో కార్మికులు ధర్నాకు దిగారు. పట్టాలపైకి వచ్చి తేజస్​ను అడ్డుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను ట్రాక్​పై నుంచి తప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అలా తేజస్​ దిల్లీ వైపు దూసుకెళ్లింది. హస్తినలోనూ కార్మికులు నిరసనలతో స్వాగతం పలికారు.

ఇదీ చూడండి:ఎప్పుడొచ్చామని కాదు.. గెలిచి తీరతాను: టిక్​టాక్​ స్టార్

Last Updated : Oct 4, 2019, 8:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details