తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం - ఉత్తర్​ప్రదేశ్

ఉత్తర్​ప్రదేశ్​ గ్రేటర్​ నోయిడాలో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. నిందితులను అరెస్ట్​ చేశారు పోలీసులు. మథురలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు 17 ఏళ్ల బాలుడు. అక్టోబర్​ 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Teenage girl gang-raped in Greater Noida
బాలికపై సామూహిక అత్యాచారం

By

Published : Oct 9, 2020, 5:20 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో బాలికలపై అరాచకాలు ఆగటం లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్​ ఘటన తర్వాత అత్యాచారాలు, అపహరణ కేసులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మథురలో 14 ఏళ్ల బాలికపై ఓ 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్​ 5న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మథురలోని హైవే పోలీస్​ స్టేషన్​ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బాలికను నిందితుడు వేరే ప్రాంతానికి తీసుకెళ్లగా రెండు రోజుల తర్వాత తిరిగివచ్చి తనపై జరిగిన అరాచకాన్ని కుటుంబానికి వివరించినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారంపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు మథుర నగర ఎస్పీ ఉదయ్​ శంకర్​ సింగ్​ తెలిపారు.

నోయిడాలో మరో ఘటన..

యూపీ గ్రేటర్​ నోయిడాలో మరో ఘటన వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం జరగగా.. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. నిందితులు, బాధితురాలు దాద్రికి గ్రామంలోని ఒకే కమ్యూనిటికి చెందిన వారని, వారంతో ఒకరికొకరు తెలుసునని పోలీసులు తెలిపారు. ఓ బాలుడిని పంపించి బాలికను సమీపంలోని తమ ఇంటికి రప్పించుకుని ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. బాధితురాలని వైద్య పరీక్షలకు పంపించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్​ చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఉత్తర్​ప్రదేశ్​లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details