తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెన్నైలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను బలిగొన్న పెళ్లి ఫ్లెక్సీ - ఫ్లెక్సీ

రహదారిపై అక్రమంగా పెట్టిన ఫ్లెక్సీ ఓ యువతి మృతికి కారణమైంది. చెన్నైలో ఫ్లెక్సీ తగిలి స్కూటీపై ప్రయాణిస్తున్న 23 ఏళ్ల సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ కిందపడిపోయింది. ఆమెపై నుంచి వాటర్​ ట్యాంకర్​ దూసుకెళ్లటం వల్ల ప్రాణాలు కోల్పోయింది.

చెన్నైలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను బలిగొన్న పెళ్లి ఫ్లెక్సీ

By

Published : Sep 13, 2019, 7:17 PM IST

Updated : Sep 30, 2019, 12:01 PM IST

చెన్నైలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను బలిగొన్న పెళ్లి ఫ్లెక్సీ
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. రహదారిపై అక్రమంగా పెట్టిన ఫ్లెక్సీ తెగి​ మీద పడటం వల్ల 23 ఏళ్ల యువతి మరణించింది. పల్లవరం-తొరైపాకం రహదారిలో ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

విధులు ముగించుకుని వెళుతుండగా..

కండంచవాడీలోని ఓ సాఫ్ట్​వేర్​ సంస్థలో పనిచేస్తున్న శుభశ్రీ (23) గురువారం విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో పల్లవరం-తొరైపాకం రహదారిలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ కార్యకర్త కుటుంబ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీ ఆమెపై పడింది. ఆ యువతి అదుపుతప్పి కిందపడిపోయింది. పక్కనుంచి వెళుతున్న ఓ వాటర్​ ట్యాంకర్​ శుభశ్రీ పైనుంచి దూసుకెళ్లింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

అతివేగంగా వస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్యాంకర్​ డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యువతి మృతికి కారణమైన అక్రమ హోర్డింగ్​లపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నాడీఎంకే కార్యకర్తపై కేసు..

యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే కార్యకర్తపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఫ్లెక్సీని ముద్రించిన ప్రింటింగ్​ యూనిట్​ను మూసివేసినట్లు చెన్నై నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా హోర్డింగ్​లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మద్రాస్​ హైకోర్టు విచారణ...

ఫ్లెక్సీ మీదపడి యువతి మరణించిన కేసుపై మద్రాస్​ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అక్రమ హోర్డింగ్​లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'రోడ్లకు రంగు వేసేందుకు రాష్ట్రప్రభుత్వానికి ఇంకెన్ని లీటర్ల రక్తం కావాలి' అంటూ ప్రశ్నించింది.

ఫ్లెక్సీలు పెట్టొద్దు...

తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్ష డీఎంకే, ఏఎంఎంకే సహా ఇతర పార్టీ నాయకులు ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కార్యకర్తలకు సూచించారు.

ఇదీ చూడండి: 'కొంచెం పనుంది... నా సజీవ సమాధి 2045కు వాయిదా'

Last Updated : Sep 30, 2019, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details