తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా నమూనాలు సేకరిస్తున్న రోబో! - Covid19 testing robo

కరోనా నమూనాలు సేకరించాలంటే పేషెంట్​ను ముట్టుకోకతప్పదు. అంటే, తప్పని పరిస్థితుల్లో వైద్యులు, ల్యాబ్​ అసిస్టెంట్లు తెలిసి తెలిసి ప్రమాదాన్ని తాకుతున్నారు. అందుకే, మనిషిని తాకకుండా నమూనాలను సేకరించే రోబోను తయారు చేశాడు తమిళనాడుకు చెందిన ఇంజినీర్. మరి, కొవిడ్​ పరీక్షలు నిర్వహించడానికి ఆ రోబో ఎలా సాయం చేస్తోందో చూసేద్దాం రండి.....

Techie developed Robot to collect samples for Covid19 Screening
కరోనా నమూనాలు సేకరిస్తున్న రోబో!

By

Published : Jun 28, 2020, 8:31 PM IST

Updated : Jun 28, 2020, 10:53 PM IST

కరోనా నమూనాలు సేకరిస్తున్న రోబో!

తమిళనాడుకు చెందిన ఓ ఇంజినీర్..​ వైద్య సిబ్బంది రక్షణను దృష్టిలో పెట్టుకుని, కరోనా పరీక్షలకు కావాల్సిన నమూనాలను సేకరించే సెమీ ఆటోమేటెడ్​ రోబోను రూపొందించాడు.

కోయంబత్తూర్​ జిల్లా, వెదప్పటికి చెందిన కార్తీక్​ వలయుత్తం ఎలక్ట్రానిక్​ ఇంజినీర్​. ఇదివరకు కరోనా రోగుల వద్దకు, ఆహారం, మందులు తీసుకెళ్లే రోబోను తయారు చేసిన కార్తీక్​ ఇప్పుడు. కరోనా అనుమానితుల ముక్కు, గొంతుల్లోంచి నమూనాలు సేకరించే రోబోను సృష్టించాడు.

కరోనా నమూనాలు సేకరిస్తున్న రోబో!

ఫోన్​తో పనిచేస్తుంది....

సుమారు 7 కిలోల బరువుండే ఈ రోబో.. స్మార్ట్ ఫోన్​లోని ఓ యాప్​ ద్వారా పనిచేస్తుంది. 360 డిగ్రీలు తిరగగల ఈ టెస్టింగ్​ రోబో జాగ్రత్తగా నమూనాలను సేకరిస్తుంది. అంతే కాదు, కేవలం రెండు నిమిషాల్లో పనిపూర్తి చేసి తనను తాను శుభ్రపరుచుకుంటుంది. దీంతో వైద్య సిబ్బంది నమూనాలు సేకరించే సమయంలో కరోనా బారిన పడకుండా కాపాడుతుంది.

కరోనా నమూనాలు సేకరిస్తున్న రోబో!

ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించే ఈ రోబోను కేవలం మూడు రోజుల్లోనే తయారు చేశాడు కార్తీక్​. రోబో తయారీకి రూ. 2000 ఖర్చయిందని.... దీనిని ప్రభుత్వం ధ్రువీకరించి.. ఆర్థిక సహకారం అందిస్తే... పూర్తి స్థాయి ఆటోమేటెడ్​ రోబోను తయారు చేస్తానంటున్నాడు​.

కరోనా నమూనాలు సేకరిస్తున్న రోబో!

ఇదీ చదవండి: ఆసుపత్రి 'చిల్లర' నిర్వాకం.. వృద్ధ దంపతుల బందీ

Last Updated : Jun 28, 2020, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details