తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమోటీవీ సమాచారం భాజపాదే :టాటాస్కై - ఈసీ

నమో టీవీ ప్రసారాలపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో టాటా స్కై మాటమార్చింది. నమో టీవీ హిందీ న్యూస్ సర్వీస్​ కాదని, ప్రత్యేకసేవ మాత్రమేనని... అందులో ప్రసారమయ్యే సమాచారం భాజపానే ఇస్తుందని ప్రకటించింది.

నమోటీవీ సమాచారం భాజపాదే:టాటాస్కై

By

Published : Apr 5, 2019, 3:15 PM IST

Updated : Apr 5, 2019, 7:51 PM IST

నమోటీవీ సమాచారం భాజపాదే :టాటాస్కై

'నమో టీవీ' వ్యవహారంలో డీటీహెచ్​ సర్వీస్​ ప్రొవైడర్​ టాటా స్కై మాట మార్చింది. 'నమోటీవీ' హిందీ న్యూస్​ సర్వీస్ కాదని.. అంతర్జాలం ద్వారా అందించే ఓ ప్రత్యేక సేవ అని ప్రకటించింది. ఈ సేవలకు ప్రభుత్వ అనుమతి (లైసెన్స్​) అవసరం లేదని పేర్కొంది.

ఇంతకు మునుపు నమోటీవీ హిందీ న్యూస్ సర్వీస్ అని, జాతీయ రాజకీయాలను సంబంధించిన బ్రేకింగ్ న్యూస్​ అందిస్తుందని టాటా స్కై ట్వీట్​ చేసింది.

ఎన్నికల తరుణంలో ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలను, భాజపా అనుకూల సమాచారాన్ని ప్రచారం చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్​, ఆప్ లాంటి పార్టీలు ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆశ్రయించాయి. ఫలితంగా ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఈ సర్వీస్​ను ఎలా ప్రారంభించారో వివరణ ఇవ్వాలని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ (ఐబీ)ని ఈసీ ఆదేశించింది.

నమో టీవీ ఒక ప్రచార వేదిక (అడ్వర్టైజింగ్​ ప్లాట్​ఫాం), దాని ప్రసారాలకు ఎటువంటి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

మార్చి 31న నమోటీవీ ప్రారంభమైంది. నరేంద్రమోదీ చిత్రం లోగో ఉన్న ఈ ఛానల్​ డీటీహెచ్​, కేబుల్ టీవీ ప్లాట్​ఫాంల్లో అందుబాటులోకి వచ్చింది. 24 గంటలు ప్రసారం అయ్యే నమో టీవీ​ ప్రారంభం కాగానే మోదీ దాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్​ చేశారు. ప్రత్యక్షంగా చౌకీదార్​ ప్రసంగాలను చూడవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. అయితే నమో టీవీకి నిధులు ఎలా సమకూరుస్తున్నారనేది తెలియదు.

Last Updated : Apr 5, 2019, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details